షాక్: చిక్కుల్లో తమన్నా.. విచారించబోతున్న ఈడి..!

Divya
టాలీవుడ్ హీరోయిన్ తమన్నా ఒకవైపు సినిమాలలో మరొకవైపు బ్రాండ్లను ప్రమోట్ చేస్తూ ఉన్నది.. అలాంటి వాటి HPZ టోకెన్ మొబైల్ యాప్ కు సంబంధించి మని ల్యాండరింగ్ కేసులో హీరోయిన్ తమన్నాను ఈడి అధికారులు ప్రశ్నించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ యాప్ ద్వారా బిట్ కాయిన్, క్రీఫ్టోకరెన్సీలను  మైనింగ్ సాకుతో చాలామంది ఇన్వెస్టర్లను సైతం మోసం చేసినట్లుగా పలు రకాల ఆరోపణలు సైతం వినిపిస్తున్నాయి. కానీ హీరోయిన్ తమన్నా పైన ఎలాంటి నిరాహారోపణలు లేవు కానీ.. అందుకే ఈమెను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ గౌహతి కార్యాలయంలో విచారించినట్లుగా సమాచారం.

అయితే అంతకుముందే తమన్నా ఈడీ కార్యాలయానికి తన తల్లితో కలిసి మధ్యాహ్నం 1:30 గంటల సమయంలో వెళ్లినట్లు సమాచారం. కేవలం యాప్ ని ప్రమోట్ చేశానని అందుకు కొంత డబ్బులు మాత్రమే తీసుకున్నాను అంటూ తెలిపిందట.ఆమె పైన ఎలాంటి ఆరోపణలు లేవని సమాచారం. హీరోయిన్ తమన్నాను ED అధికారులు  విచారించడం రెండవసారి.. గతంలో మహదేవ్ బెట్టింగ్ యాప్ కేసులో కూడా ఏమైనా విచారించడం జరిగింది.IPL పెయిర్ ప్లే యాప్ ను  సైతం ప్రచారం చేసినట్లుగా పలు రకాల వాటిలో ఆరోపణలు వినిపించాయి. ఏప్రిల్ లో అందుకు సంబంధించి విచారణ కూడా జరిగింది.

ముఖ్యంగా ఇందులో 10 మంది చైనీస్ మూలాలు ఉన్న డైరెక్టర్ల పేర్లు కూడా ఉన్నాయి. కోహిమ పోలీసులకు చెందిన సైబర్ క్రైమ్ వార్డ్ దాఖలు చేసిన ఆధారంగా మనీలాండరింగ్ కేసు ఒక్కసారిగా వెలుగులోకి వచ్చింది. ఇందులో బిట్కాయిన్ ఇతరత్రా వాటి వల్ల రాబడి వస్తుందని చెప్పి పెట్టుబడిదారులను మోసగిస్తున్నారట. వినియోగదారులను మోసం చేయడానికి HPZ మొబైల్ ఫోన్ లే అక్క అప్లికేషన్లను సైతం ఉపయోగించారంటూ పోలీసులు వెల్లడించారు. ఇలా వచ్చే ఆదాయాన్ని తరలించేందుకు డమ్మీ డైరెక్టర్లతో పలు రకాల బ్యాంకు ఖాతాలను కూడా లింక్అప్ చేసుకున్నారని ఈడి అధికారులు తెలియజేశారు.. సుమారుగా 57,000  పెట్టుబడి పెడితే మూడు నెలల్లోనే రోజుకు 4000 పాటు రిటర్న్ వస్తుందని హామీ ఇవ్వడంతో చాలామంది పెట్టుబడులు పెట్టారట. అలా ఒక నెల మాత్రమే అందులో ఉన్న వారందరికీ పెట్టుబడులు ఇవ్వగా.. ఈడి ఆదికారులు చేయడంతో సుమారుగా 455 కోట్ల రూపాయలు స్థిరాస్తులు, డిపాజిట్లను కూడా స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. అయితే ఇవన్నీ కూడా మహాదేవ్ బెట్టింగ్ యాప్ కి లింక్ అప్ అయినట్లు సమాచారం. దీన్ని బట్టి చూస్తే తమన్నాకు చిక్కులు తప్పేలా కనిపించడం లేదనే విధంగా వార్తలు వినిపిస్తున్నాయి మరి ఇకమీదటైనా తమన్న ఇలాంటివి చేయడం ఆపుతుందేమో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: