టీవీ: మొదటిసారి మాజీ భార్య ఎస్తర్ పై.. నిజాలు చెప్పేసిన బిగ్ బాస్ నోయాల్..!

Divya
బిగ్బాస్ కంటెస్టెంట్ గా, సింగర్ గా, నటుడుగా మంచి పాపులారిటీ సంపాదించుకున్నాడు నోయాల్ .. విక్రమార్కుడు చిత్రంలో ర్యాప్ సాంగ్ ద్వారా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. వీటితోపాటు నోయల్ రేడియో జాకిగా పనిచేశారట. ఇక నటుడుగా కుమారి 21ఎఫ్ చిత్రంలో విభిన్నమైన పాత్రలో కనిపించి అందరిని ఆకట్టుకున్నారు. నోయాల్ సినీ జీవితంలో కాస్త హ్యాపీగా ఉన్నప్పటికీ తన వ్యక్తిగత జీవితంలో మాత్రం ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నాడు. వాటి గురించి ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పలు విషయాలను తెలిపారు.

నోయాల్ ఒక హీరోయిను ప్రేమించి మరి వివాహం చేసుకున్నారు.. అయితే అలా వివాహం చేసుకున్న కొన్ని రోజుల వ్యవధిలోని వీరిద్దరూ విడిపోవడం జరిగింది. దీంతో అభిమానులు కూడా ఆశ్చర్యపోయారు. నోయాల్ భార్య ఎవరో కాదు ఎస్తర్ నోరోన్హా. ఈమె పలు సినిమాలలో హీరోయిన్ గా నటించడమే కాకుండా.. ఈ మధ్యకాలంలో పలు కీలకమైన పాత్రలలో కూడా నటిస్తున్నది. అలాగే కన్నడ, తమిళం, మరాఠి ,హిందీ వంటి భాషలలో కూడా నటిస్తోంది. నోయల్ తన మాజీ భార్య గురించి మాట్లాడుతూ.. తన మాజీ భార్య ( ఎస్తర్ నోరోన్హా) విషయంలో తాను ఎప్పుడూ కూడా పాజిటివ్గానే ఉండేవాడినని తెలిపారు.

తాను ఇప్పటికే కూడా అలాగే ఉన్నానని.. ప్రపంచంలో ఉండే వారందరూ కూడా తన వాళ్లే అనుకున్నానని కానీ ఆమె ఒక ఇంటర్వ్యూలో తన గురించి చెప్పిన కామెంట్స్ తనని చాలా బాధను కలిగించాయని తెలిపారు.. ఆమె చెప్పిన మాటలకు తనతో ఉన్న వాళ్ళు కూడా దూరమయ్యారు ఎన్నో సినిమా ఆఫర్లు వచ్చిన చేజారిపోయాయని తెలిపారు. కానీ ఆ విషయాలను కూడా తాను పాజిటివ్గానే తీసుకున్నారని తెలిపారు నోయాల్. తనని నేను టార్చర్ చేశానని చెప్పింది కానీ తనతో జర్నీ మాత్రం చాలా అందంగా ఉందని తెలిపారు మనం నిజంగా ఎవరినైతే ఇష్టపడి ప్రేమిస్తామో వాళ్లని మనం ఏమి అనలేము.. అప్పుడు తన పరిస్థితి కూడా అలాగే ఉండేది అంటూ తెలిపారు నోయాల్. కానీ లవ్ లో ఉన్నప్పుడు బ్రేకప్ అయితే ఏమీ కాదు వివాహమైన తర్వాత విడిపోతే కుటుంబాలకు చాలా ఇబ్బంది అంటూ తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: