యాటిట్యూడ్ స్టార్ 'రామ్ నగర్ బన్నీ ' తో ఎన్ని కోట్లకు బొక్క పెట్టాడంటే..?

murali krishna
ప్రముఖ టెలివిజన్ నటుడు ప్రభాకర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. తన అద్భుతమైన నటనతో ఎన్నో సీరియల్స్ లో నటించి మెప్పించాడు.. అంతే కాకుండా నటుడుగా పలు సినిమాల్లో నటించి మెప్పించారు .. ఇదిలా ఉంటే టాలీవుడ్ లో వరుసగా యంగ్ హీరోలు దూసుకొస్తున్నారు.. టాలెంట్ వున్న యంగ్ హీరోలు స్టార్ హీరోలుగా నిరూపించుకుంటున్నారు.. తాజాగా ప్రభాకర్ కొడుకు చంద్రహాస్ సినీ ఇండస్ట్రీకి అడుగుపెట్టాడు  రామ్ నగర్ బన్నీ సినిమాతో చంద్రహాస్ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.. సినిమా మొదలు కాక ముందే తన యాటిట్యూడ్ తో మంచి క్రేజ్ తెచ్చుకుని యాటిట్యూడ్ స్టార్ గా  గుర్తింపు పొందిన చంద్రహాస్ తన మొదటి సినిమాతో ఏ విధంగా మెప్పించాడో ఇప్పుడు చూద్దాం..యంగ్ హీరో హీరో చంద్రహాస్ నటించిన రామ్ నగర్ బన్నీ సినిమాను మళయజ ప్రభాకర్, ప్రభాకర్ పొడకండ నిర్మించారు. దివిజ ప్రభాకర్ సమర్పించారు. అక్టోబర్ 4వ తేదీన గ్రాండ్ గా రిలీజైన ఈ సినిమా ప్రేక్షకుల నుండి మంచి టాక్ తెచ్చుకున్నా కానీ  ఆ టాక్‌ను పూర్తిగా కలెక్షన్ల రూపంలోకి మార్చుకోలేకపోయారని టాక్ ట్రేడ్ వర్గాల్లో వ్యక్తమవుతున్నది.

కానీ హీరో చంద్రహాస్‌ నటనకు సినీ విశ్లేషకుల నుంచి మంచి మార్కులే పడ్డాయి. అయితే ఈ సినిమా కలెక్షన్ల పరంగా నిరాశ పరిచిందనే చెప్పాలి.రామ్ నగర్ బన్నీ సినిమా ఓటీటీ రైట్స్‌ను జీ5 స్టూడియో సొంతం చేసుకొన్నది. ఈ సినిమా హక్కులను సుమారుగా 1 కోటి రూపాయలకు దక్కించుకున్నట్లు  ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఈ సినిమా థియేట్రికల్‌గా 50 లక్షలు వసూలు చేసింది. దాంతో ఈ సినిమా సుమారుగా 1.5 కోట్లు రికవరీ సాధించింది. ఈ సినిమా సుమారుగా 2.5 కోట్ల మేర నష్టాలను నమోదు చేసుకొన్నదని ట్రేడ్ వర్గాల సమాచారం.భారీ క్రేజ్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన రామ్ నగర్ బన్నీ చిత్రం మొత్తంగా 80 లక్షల గ్రాస్ వసూళ్లు.. 40 లక్షల షేర్ వసూళ్లు రాబట్టింది. ఈ సినిమా థియేట్రికల్ రన్ ముగిసే సరికి 50 లక్షల షేర్, 1 కోటి రూపాయల గ్రాస్ వసూళ్లను నమోదు చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: