పెళ్లి చేసుకోబోతున్న బిగ్ బాస్ సోనియా.. వరుడు ఎవరంటే..?
సోనియా బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడు తన ప్రేమ వ్యవహారాన్ని సైతం బయటపెట్టింది మూడేళ్లుగా తామిద్దరం కలిసి పని చేస్తున్నప్పటికీ తమ ప్రేమ గురించి మాత్రం చెప్పలేదని సోనియా తెలిపింది. అయితే ఇప్పుడు తాజాగా తన ఫ్రెండ్స్ కి ఇంటర్వ్యూ ఇస్తున్న సమయంలో వీరి వ్యవహారాన్ని సైతం అడగగా తెలియజేసింది. సోనియా బాయ్ ఫ్రెండ్ పేరు యష్. ఇతనికి ఫ్లైట్ అనే టూరిజం సంస్థ కూడా ఉన్నదట అలాగే ఆ బ్రాండ్ కి వెళ్లి స్టూడెంట్స్ కోసం ప్రత్యేకంగా ఒక సంస్థ కూడా ఉన్నదట.
హౌస్ నుంచి బయటికి వచ్చిన సోనియా, యష్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సోనియా తన సంస్థలో పనిచేస్తుందని రెండు మూడేళ్లుగా ఇద్దరం కూడా కలిసి పని చేస్తున్నామని అక్కడే తామద్దరికీ పరిచయం ఏర్పడిందని అప్పుడే ప్రేమలో పడ్డామని తెలిపారు యష్. ఇంట్లో కూడా వివాహానికి ఓకే అన్నారు బిగ్ బాస్ కి వెళ్లే ముందే చేసుకోవాలనుకున్నాము కానీ కొన్ని కారణాల చేత ఆగిపోయాము అందుకే సోనియా హౌస్ లోకి అడుగు పెట్టిందనీ తెలిపారు యష్. ఈ ఏడాది డిసెంబర్లో వివాహం చేసుకోబోతున్నామని తెలియజేశారు. దీంతో అటు సోనియా ఫ్యాన్స్ ఈ జంటకు ముందుగానే కంగ్రాట్యులేషన్స్ చెబుతూ ఉన్నారు. సోనియా కూడా తన బాయ్ ఫ్రెండ్ తో కలిసి మాల్దీవుల్లో ఎంజాయ్ చేస్తున్న ఫోటోలకు సైతం ట్యాగ్ చేసి మరి ఫోటోలను షేర్ చేసింది.