ఈవీఎంలు.. ఎలా టాంపరింగ్ చేయాలో చంద్రబాబుకు తెలుసా?

praveen
మొన్నటికి మొన్న ముగిసిన అసెంబ్లీ ఎన్నికల్లో ఏపీ ప్రజలందరూ కూడా అనూహ్యమైన ఫలితాలకు కారణమయ్యారు అన్న విషయం తెలిసిందే. ఎందుకంటే అధికారంలో ఉండి ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేసిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి.. కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా దారుణమైన పరాజయాన్ని ఇచ్చేశారు ఏపీ ప్రజలు. అదే సమయంలో గతంలో ప్రతిపక్షంలో ఉన్న టిడిపి, జనసేన, బిజెపి పార్టీల కూటమికి అఖండ విజయాన్ని అందించారు. ఏకంగా కూటమి కూటమి 164 సీట్లలో విజయం సాధిస్తే అధికార వైసిపి మాత్రం కేవలం 11 సీట్లకు మాత్రమే పరిమితమైంది అన్న విషయం తెలిసిందే.

 అయితే రాజకీయాలు అన్న తర్వాత గెలుపు ఓటమిలు సహజమేనని అటు వైసిపి నేతలు అనుకున్నప్పటికీ ఫ్యాన్ పార్టీకి ఇంత దారుణమైన ఓటమి వస్తుందని మాత్రం ఎవరూ కూడా కలలో కూడా ఊహించలేదు. ఈ క్రమంలోనే ఎక్కడో ఏదో అన్యాయం జరిగిందని ఈవీఎంలను ట్యాంపరింగ్ చేసి ఉంటారు అంటూ ఎంతో మంది ఆరోపణలు చేస్తూ ఉన్నారు. సోషల్ మీడియాలో ఇదే విషయంపై చర్చ జరుగుతుంది. అధికారంలో ఉన్న వైసీపీకి ఇక అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలు అందేలా చేసిన ఆ పార్టీకి ఇంత దారుణ పరాజయం రావడాన్ని ఎవ్వరూ నమ్మలేకపోతున్నారు.

 దీంతో తప్పకుండా ఈవీఎంల టాంపరింగ్ జరిగింది అంటూ వార్తలు వస్తూ ఉండగా.. ఇదే విషయంపై లక్ష్మీపార్వతి సంచలన ఆరోపణలు చేశారు  ఈవీఎం ట్యాంపరింగ్ చేసే టీడీపీ గెలుపొందింది అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. మీడియా చిట్ చాట్ లో మాట్లాడుతూ స్కిల్ స్కామ్ కేసులో అరెస్టై జైలులో రహస్య ప్రదేశం లో ఉన్న చంద్రబాబు ఈవీఎం టాంపరింగ్ ఎలా చేయాలో నేర్చుకున్నారు. హరి ప్రసాద్ అనే వ్యక్తి ఈ విషయాన్ని చంద్రబాబుకు నేర్పించారు. ఆయన వాళ్ల దగ్గరే ఉన్నారు అంటూ లక్ష్మీ పార్వతి సంచలన ఆరోపణలు చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: