ఆ విషయంలో మన శంకర వరప్రసాద్ గారు టీంకి ప్రశంసలు..?

Pulgam Srinivas
టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి మెగాస్టార్ చిరంజీవి తాజాగా మన శంకర వర ప్రసాద్ గారు అనే ఫ్యామిలీ ప్లస్ కమర్షియల్ ఎంటర్టైలర్ మూవీ లో హీరో గా నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ లో నయనతార హీరోయిన్గా నటించగా ... అనిల్ రావిపూడి ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. షైన్ స్క్రీన్స్ బ్యానర్ , గోల్డ్ బాక్స్ బ్యానర్లపై సాహు గారపాటి , సుస్మిత కొణిదెల సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. ఈ మూవీ ని ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 12 వ తేదీన విడుదల చేయనున్నారు. ఇకపోతే గత కొంత కాలంగా టాలీవుడ్ స్టార్ హీరోలు నటించిన సినిమాలకు సంబంధించిన టికెట్ బుకింగ్స్ మన తెలుగు రాష్ట్రాలలో సినిమా విడుదలకు అత్యంత సమయం దగ్గర పడిన సమయంలో ఓపెన్ చేస్తున్నారు.


దానితో ఆ హీరో అభిమానులు ఆ సినిమా నిర్మాతలపై, డిస్ట్రిబ్యూటర్ల పై తీవ్ర స్థాయిలో అసంతృప్తిని వ్యక్తం చేస్తూ వస్తున్నారు. ఇకపోతే మన శంకర ప్రసాద్ గారు మూవీ యూనిట్ మాత్రం పక్కా స్ట్రాటజీతో ఈ మూవీ కి సంబంధించిన రెండు తెలుగు రాష్ట్రాల థియేటర్ బుకింగ్స్ ను ఓపెన్ చేసి ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ సినిమా టికెట్ ధరల పెంపుకు సంబంధించిన జీవో వచ్చేసింది. ఇక ఈ రోజు ఈ సినిమాకు సంబంధించిన టికెట్ బుకింగ్స్ ఆంధ్ర ప్రదేశ్ అంతటా ఓపెన్ కానున్నట్లు ఈ మూవీ బృందం అధికారికంగా ప్రకటించింది. ఇక తెలంగాణ రాష్ట్రంలో కూడా ఈ రోజు నుండే ఈ సినిమా యొక్క టికెట్ బుకింగ్స్ ఓపెన్ అయ్యే అవకాశాలు ఉన్నతే తెలుస్తుంది. ఇలా ఈ మూవీ బృందం వారు ఈ సినిమా టికెట్ బుకింగ్స్ ఓపెన్ అయ్యే విషయంలో సూపర్ స్ట్రాటజీతో ముందుకు వెళుతుండడంతో ఈ విషయంలో ఈ మూవీ బృందంపై మెగా అభిమానులు మాత్రమే కాకుండా అనేక మంది సాధారణ ప్రేక్షకులు కూడా ప్రశంసలు కురిపిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: