చంద్రబాబు: ఏపీ చరిత్రలోనే అరుదైన రికార్డు నెలకొల్పిన బాబు??

Suma Kallamadi
తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు నాలుగోసారి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఈరోజు ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఉదయం 11:27 నిమిషాలకు ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ, చిరంజీవి, తదితర రాజకీయ ప్రముఖులు రానున్నారు. చంద్రబాబు ఫోన్ కాల్ ద్వారా జగన్‌ను కూడా ఈ కార్యక్రమానికి పిలిచే ప్రయత్నం చేశారట కానీ ఆ వైసీపీ అధినేత అందుబాటులోకి రాలేదని సమాచారం. 24 మంత్రులతో చంద్రబాబు మంత్రివర్గ జాబితా కూడా రీసెంట్ గా రిలీజ్ అయింది. దీని ప్రకారం పవన్ కళ్యాణ్ కు డిప్యూటీ సీఎం పదవి ఇచ్చారు. ప్రమాణ స్వీకారం తర్వాత చంద్రబాబు ఈరోజు రాత్రి తిరుమల చేరుకొని శ్రీవారి బ్లెస్సింగ్స్ తీసుకోనున్నారు.
ఇదిలా ఉండగా చంద్రబాబు ఈరోజుతో చరిత్ర సృష్టించనున్నారు. ఏపీకే ఆయన నాలుగో సారి సీఎం కానున్నారు. ఆంధ్రప్రదేశ్ కు నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన ఏకైక నేతగా చంద్రబాబు చరిత్ర పుటల్లో నిలిచిపోనున్నారు. చంద్రబాబు ఈ ఘనత సాధించడానికి తన పూర్తి జీవితాన్ని అంకితం చేశారు. ఆయన ఎప్పటినుంచో రాజకీయాల్లో ఉన్నారు.
మొదటగా 1975లో ఇండియన్ యూత్ కాంగ్రెస్‌లో చేరారు. ఆ రోజుల నుంచి టీడీపీ కీలక వ్యక్తిగా మారే వరకు బాబు రాజకీయ జీవితంలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నారు. ఆయన ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో విజయ బావుటా ఎగరవేశారు. పోయినసారి 23 అసెంబ్లీ స్థానాలకే పరిమితమయ్యారు. గడిచిన 5 ఏళ్లలో వైసీపీ అవినీతి, అరాచక, విధ్వంసకర పాలనకు బాబు ఎదురొడ్డారు. అన్నిటినీ తట్టుకుని చివరికి జనసేన, బీజేపీ అండదండలతో మళ్లీ అధికారంలోకి రాగలిగారు. రాష్ట్ర అభివృద్ధి పట్ల ఆయనకున్న అంకితభావానికి ఈ అఖండ విజేయమే ఒక నిదర్శనం అని చెప్పుకోవచ్చు. బీజేపీ, జనసేన పార్టీలతో తన పార్టీ పొత్తు బలాన్ని తెలియజేస్తోంది.
టీడీపీ కూటమి ఈసారి 164 స్థానాలను కైవసం చేసుకుంది. అధికార వైఎస్సార్సీపీ కేవలం 11 సీట్లతో ఘోర పరాజయాన్ని చవి చూసింది. ప్రజల నుంచి వచ్చిన ఈ బలమైన మద్దతు చూస్తుంటే ఆంధ్రప్రదేశ్ ని అభివృద్ధి పథంలో నడపగల ఏకైక నేత బాబు ఒక్కరే అని ప్రజలు బలంగా నమ్మినట్లు తెలుస్తోంది. ఎనిమిదేళ్ల 256 రోజుల పాటు ముఖ్యమంత్రిగా సుదీర్ఘకాలం కొనసాగిన రికార్డు కూడా ఆయన సొంతం.
తన పదవీ కాలంలో బాబు మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం, పెట్టుబడులను ఆకర్షించడం, రాష్ట్ర హ్యాపీనెస్ ఇండెక్స్‌ను పెంచడం వంటి ఇతర విజయాలపై దృష్టి సారించారు. ఆర్థిక పునరుద్ధరణ, వనరుల నిర్వహణలో ఆయన చేసిన కృషి కష్ట సమయాల్లో రాష్ట్రానికి సహాయపడింది. బాబు మళ్లీ తన సీఎం పాత్రలోకి అడుగుపెట్టడంతో, అభివృద్ధి కాలం మొదలైందని ఏపీ ప్రజలు సంతోషిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: