ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికలు: దేశమంతా షాకయ్యే రేంజ్‌లో?

Chakravarthi Kalyan
ఈసారి ఏపీ అసెంబ్లీ ఎన్నికలు సంచలనాలకు వేదికగా మారింది. దేశ, విదేశాల్లో ఉన్నవారిని ప్రవాస భారతీయులు అంటారు. కానీ ఏపీలో చాలామంది ఇతర రాష్ట్రాలకు, విదేశాలకు వెళ్లి స్థిరపడ్డారు. వారిని ప్రవాస ఆంధ్రులు అనొచ్చేమో. కానీ ఏపీ భవిష్యత్తు విషయంలో వీరంతా చాలా బాధ్యతగా వ్యవహరించారు. ఇది ఆంధ్రా ఎన్నికలు సాధించిన అద్భుతంగా చెప్పవచ్చు.

మనం హైదరాబాద్, ఇతర నగరాలను చూసుకుంటే.. పక్కనే ఉన్నా కూడా పోలింగ్ బూత్ ల దగ్గరకి వెళ్లి కూడా ఓటు వేయరు. కానీ ప్రజాస్వామ్యం గురించి వాట్సప్ లలో స్టేటస్ లు పెడుతుంటారు. కానీ ఏపీలో అలా కాదు. ప్రస్తుతం విదేశాలు, ఇతర రాష్ట్రాల నుంచి దాదాపు 80శాతం మంది ఓటు వేసేందుకు తమ సొంతూర్లకు వచ్చారు. దాదాపు అందరూ రావడానికే యత్నించారు. వీరంతా ఏ పార్టీకి ఓటు వేశారో పక్కన పెడితే.. ప్రజాస్వామ్యంపై వీరికి ఉన్న గౌరవాన్ని చాటి చెప్పారు.

ఇలా దాదాపు 25 లక్షల మంది, 30 లక్షల మంది వచ్చి ఓటేశారు అని ఎవరికీ వారు ప్రచారం చేసుకుంటున్నా.. వాస్తవ పరిస్థితులను గమనిస్తే ఆ రేంజ్ లో వచ్చే అవకాశం లేదని తెలుస్తోంది. ఎందుకంటే అంత మంది రెండు, మూడు రోజుల్లో వెళ్లాలంటే ఎన్ని వాహనాలు, బస్సులు, కార్లు అవసరం అవుతాయో మనం ఊహించుకోవచ్చు. బారులు తీరిన వాహనాలు చూసినా.. ఓ పది నుంచి పన్నెండు లక్షల వరకు వెళ్లవచ్చు అని అంచనా..

అయితే విదేశాల్లో ఉండే వారిని రప్పించడంలో కూడా ఆయా రాజకీయ పార్టీలు విజయవంతం అయ్యాయి. ఇందులో ముఖ్యంగా టీడీపీ నాయకులు ప్రవాస భారతీయులను ఇక్కడికి రప్పించేలా వ్యూహ రచన చేశారు. ఆ పార్టీకి చెందిన వారు దాదాపు 80శాతం మంది వచ్చారని విశ్లేషకులు చెబుతున్నారు. ఇదే సమయంలో వైసీపీ అనుకూల ఓటర్లు ఓ 40 శాతం మంది లోపు వచ్చారని పేర్కొంటున్నారు. అర్ధ రాత్రి వరకు బారులు తీరి ఓపికగా ఓటు వేయడం అనేది ప్రజాస్వామ్యంలో అద్భుత విషయమనే చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: