
ఢిల్లీ పోలీసుల నుండి నోటీసులు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం?
హోం మంత్రి అమిత్ షా కేవలం ముస్లిం రిజర్వేషన్లు మాత్రమే రద్దుచేసి బీసీ ఎస్టీ ఎస్సీలకు రిజర్వేషన్లను కొనసాగిస్తాము అని చెప్పిన వీడియోని... ఇక అన్ని వర్గాలకు రిజర్వేషన్లు రద్దు చేస్తున్నారు అంటూ చెప్పినట్లుగా ఎడిట్ చేసి వైరల్ చేయడంతో.. ఇక దీనిపై కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇక ఈ క్రమంలోనే బిజెపి, హోం మంత్రిత్వ శాఖ పోలీసులకు ఫిర్యాదు చేయగా.. ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే తెలంగాణ పిసిసి అధికారిక సోషల్ మీడియా ఖాతా నుంచే అమిత్ షా వీడియో పోస్ట్ చేసినట్లు తేలింది.
ఈ క్రమంలోనే పిసిసి చీఫ్ రేవంత్కు ఢిల్లీ పోలీసులు నోటీసులు జారీ చేశారు. సీఎం తో పాటు డిజిపి, సీఎస్కు కూడా ఢిల్లీ పోలీసులు నోటీసులు ఇవ్వడం గమనార్హం. అయితే ఇలా నేడు సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పోలీసుల ముందు విచారణకు హాజరు కావాల్సి ఉండగా .. రేవంత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం తాను ఐఎఫ్ఎస్వో ఢిల్లీ పోలీసుల ముందు హాజరయ్యేందుకు సిద్ధంగా లేనట్లు చెప్పుకొచ్చారు. దీనికి కారణం అని రాష్ట్రంలో సీఎం రేవంత్ స్టార్ కంపెనీగా ప్రచారం చేస్తున్నారు. ఇక సోషల్ మీడియా పోస్ట్ కేసులో న్యాయ పరంగా వెళ్లాలని నిర్ణయించుకున్నారు. అందుకే ఇక నాలుగు వారాల గడువు కోరినట్లు తెలుస్తుంది. తనకు వచ్చిన నోటీసులోని అన్ని వివరాలను పరిశీలించిన తర్వాత విచారణకు హాజరవుతాను అంటూ రేవంత్ సంచలన నిర్ణయం తీసుకున్నాడట.