హీరో అజిత్ గురించి ఆసక్తికరమైన విషయాలు?

Purushottham Vinay
కోలీవుడ్ ఇండస్ట్రీలో ఎక్కువ ఫ్యాన్ ఫాలోయింగ్ తో టాప్ స్టార్ గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి నటుడు అజిత్  గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈయన  తన సినిమాలతో తెలుగు తమిళ భాషలలో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. ఈమధ్య తెలుగులో తక్కువే అయిన కెరీర్ స్టార్టింగ్ లో అజిత్ డబ్బింగ్ సినిమాలు తెలుగులో బాగా హిట్ అయ్యేయి. అజిత్ ఫస్ట్ మూవీ కూడా తెలుగు సినిమా ప్రేమ పుస్తకం కావడం విశేషం. కానీ తమిళ్ లో తిరుగులేని స్టార్డం సొంతం చేసుకోవడనతో అక్కడే టాప్ హీరోగా ఫిక్స్ అయిపోయారు.అజిత్ హీరోయిన్ శాలిని ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం మనకు తెలిసిందే. అజిత్ సినిమాలు ఎంతో ఇష్టపడతారు. అయితే ఈయన సినిమాల తర్వాత ఇష్టపడేది ఏదైనా ఉంది అంటే అది బైక్ రైడింగ్ మాత్రమే అని అందరికి తెలుసు.అజిత్ బైక్ రైడ్ చేస్తూ చాలా సుదూర ప్రాంతాలకు వెళ్తూ ఉంటారు. ఇలా బైక్ రైడింగ్ అంటే ఎంతో పిచ్చి ఉన్న అజిత్ తాజాగా తన పుట్టినరోజు వేడుకలను జరుపుకుంటున్నారు.53వ పుట్టినరోజు వేడుకలను జరుపుకుంటున్నటువంటి క్రమంలో ఆయన భార్య శాలిని ఊహించిన విధంగా అజిత్ కి బిగ్ సర్ప్రైజ్ ఇస్తూ సంతోషపెట్టారు.


అజిత్ కోసం శాలిని ప్రత్యేకంగా ఖరీదైన Ducati బైక్‌ను బహుమతిగా అందజేసింది. దీనికి సంబంధించిన స్టిల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఇలా తన భర్తకు ఊహించని విధంగా తనకు ఎంతో ఇష్టమైనటువంటి బహుమతి అందజేస్తూ శాలిని సర్ప్రైజ్ చేశారు. ఇక అజిత్ సినిమాల విషయానికి వస్తే..ఏకే 62గా వస్తున్న విదా ముయర్చి సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాలో త్రిష ఫీమేల్ లీడ్ రోల్‌లో నటిస్తోంది. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ మూవీకి అనిరుధ్‌ రవిచందర్ సంగీతం అందిస్తున్నాడు. అజిత్ చాలా సింపుల్ గా న్యాచురల్ గా ఉంటారు. ఎక్కువ గొప్పలకు పోడు. ఎలాంటి హాడావిడి చెయ్యడు. పబ్లిక్ గా చాలా దూరంగా ఉంటాడు. కనీసం తన సినిమాల ఫంక్షన్స్ కి కూడా అజిత్ వెళ్ళడు. తమిళనాడులో రజినీకాంత్ తరువాత ఆ రేంజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న అజిత్ ఎలాంటి సోషల్ మీడియా అకౌంట్స్ కూడా వాడడు.ఓన్లీ సినిమాలు, బైక్ రైడింగ్, ఫ్యామిలీ.. ఇవే తన లోకం. ప్రస్తుతం అజిత్ కి విజయ్ కి మధ్య తమిళనాడు సినిమా ఇండస్ట్రీలో పోటీ నడుస్తుంది. ఇంకో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే అజిత్ తెలుగు వాడే. ఆయన పుట్టింది సికింద్రాబాద్ లో. కానీ చెన్నై వెళ్లి కష్టపడి హీరో అయ్యి నేడు తమిళ టాప్ హీరోగా దూసుకుపోతున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: