ముద్రగడ కొడుకుకి టిడిపి టికెట్..?

KSK
2014 ఎన్నికల్లో టిడిపి అధినేత చంద్రబాబు కాపులను బీసీల్లో చేస్తామని చెప్పి హామీ ఇచ్చిఅధికారంలోకి వచ్చాక...ఆ హామీని తుంగలో తొక్కారని కాపుల గురించి ఉద్యమం చేపట్టారు కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం. గత కొంతకాలంగా ముద్రగడ పద్మనాభం కుటుంబానికి మరియు అధికార పార్టీకి టీడీపీ మధ్య అనేక వివాదాలు చోటు చేసుకున్నాయి.


అయితే తాజాగా ఎన్నికలు వస్తున్న క్రమంలో ఒక్కసారిగా సమీకరణాలు మొత్తం మారిపోయాయి. ఈ నేపథ్యంలో కాపు ఉద్యమనేత మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం నివాసంలో కాపు జేఏసీ నేతలతో తెలుగుదేశం పార్టీ కీలక నేత భేటీ అయ్యారు.


ముద్రగడను టీడీపీ కి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లుగా సమాచారం ముద్రగడ కుమారుడికి టికెట్‌ ఇచ్చే అంశం పై చర్చలు జరుగుతున్నట్లు తెలియవచ్చింది.ముద్రగడ పద్మనాభం ఏ రాజకీయ పార్టీ వైపు ఉంటారనేది తేలలేదు.


కాపు రిజర్వేషన్ల పై అసెంబ్లీలో తీర్యానం చేసి కేంద్రానికి పంపిన సమయంలో ముద్రగడ చంద్రబాబుకు అనుకూలంగా మారినట్లు కనిపిచురు కానీ ఆ తర్వాత లేఖాస్త్రాలు సంధిస్తూ ముద్రగడను వైఎస్‌ఆర్‌సిపి వైపు తిప్పుకునేందుకు జగన్‌ ప్రయత్నాలు సాగిసస్తూన్నట్లు తెలుస్తోంది. బీసీలను కాపులను తన వైపు తిప్పుకుంటే విజయం ఖాయమనే ఆలోచనతో జగన్‌ వ్యూహరచన చేస్తున్నట్లు సమాచారం.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: