వైఎస్ జగన్ తాత, తండ్రి, బాబాయిల హత్య సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబే! విజయసాయిరెడ్డి

అనుమానస్పద స్థితిలో మృతి చెందిన వైఎస్‌ వివేకానందరెడ్డి ది హత్యేనని పోస్ట్‌మార్టం ప్రాథమిక నివేదికలో తేలినట్లు సమాచారం. ఆయన శరీరంపై ఏడు కత్తిగాయాలు ఉన్నాయని వైద్యులు తమ నివేదికలో వెల్లడించారు.

1998 నుంచి వైఎస్‌ కుటుంబాన్ని టార్గెట్‌ చేశారని తెలిపారు. 1998 లో వైఎస్‌ రాజారెడ్డిని హత్య చేశారని వెల్లడించారు. ఒక రోజు చంద్రబాబు అసెంబ్లీలో, కొద్ది రోజుల్లో ఎవరు ఫినిష్ అవుతారో చూడండి అన్నారని, ఆ తర్వాత రెండు రోజుల్లో వైఎస్సార్‌ హెలికాఫ్టర్‌ ప్రమాదానికి గురయ్యారని పేర్కొన్నారు. అలాగే వైఎస్ జగన్ మోహన రెడ్డిని అత్యంత రక్షణ ఉండే ఏయిర్ పోర్ట్ లో హత్యాప్రయత్నం జరిగినప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబే. అంతే కాదు నాడు రాష్ట్ర పోలీస్ బాస్ మాట్లాడిన మాటలు చూస్తే పోలీస్ వ్యవస్థ ప్రభుత్వానికి గులాంగిరీ చేస్తుందని అందరూ గుర్తించారని, ఇప్పుడు దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి సోదరుడు వైఎస్‌ వివేకానంద రెడ్డి హత్యకుట్రను అమలు చేసింది టీడీపీ నేత ఆదినారాయణరెడ్డేనని వైసిపి నేత విజయసాయిరెడ్డి ఆరోపించారు.

ఆదినారాయణరెడ్డి నీతి, జాతీలేని వ్యక్తి, మనిషి కాదు దుర్మార్గుడు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, వివేకానందరెడ్డిహత్యలో ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ఆయన కుమారుడు నారా లోకేష్‌లు సూత్రధారులన్నారు.  ఆ కుట్రలో కూడా టీడీపీకి సంబంధించినవారే ఉన్నారన్నారు.

వివేకానందరెడ్డి హంతకులకు టీడీపీ ఆఫీసులో రక్షణ కల్పించారన్నారు. రాత్రి జమ్మలమడుగులో ప్రచారం పూర్తి చేసుకుని వివేకానందరెడ్డి ఇంటికి చేరుకున్నారని, ఆ తర్వాతే ఆయన హత్య జరిగిందన్నారు. ఇంటిలిజెన్స్‌ అధికారులు చంద్రబాబు నాయుడు కోసం పనిచేస్తున్నారని, పోలీస్‌ వ్యవస్థను చంద్రబాబు భ్రష్టు పట్టి స్తున్నారని మండిపడ్డారు. 

చెరుకులపాడు నారాయణరెడ్డి  హత్యకేసును కూడా నీరుగార్చారన్నారు. వివేకానందరెడ్డి హత్యకేసును సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు. ఈ చంద్ర బాబు ప్రభుత్వం వేసిన సిట్‌ పై తమకు నమ్మకం లేదని, అందుకే సీబీఐతో విచారణ జరపించాలన్నారు. ఆదినారాయణరెడ్డి గతచరిత్ర హంతకుడని, ఆయన ఎన్ని హత్యలు చేయించాడో అందరికీ తెలుసునన్నారు. జమ్మలమడుగులో ఓడిపోతారనే భయంతోనే వివేకానందరెడ్డిని హత్య చేశారన్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: