స్వరం మార్చిన వల్లభనేని.. ఆ విషయం అర్థమైందా ఏంటి?

praveen
సాధారణంగా రాజకీయాల్లో ఎప్పుడూ ఎవరు ఎలా యూటర్న్ తీసుకుంటారు అన్నది ఊహకందని విధంగానే ఉంటుంది. అప్పుడు వరకు ఒక నాయకుడిని తిట్టిపోసిన నేతలు ఇక ఆ తర్వాత కాలంలో అదే నాయకుడితో కలిసి పని చేయడం చూస్తూ ఉంటాం. ఒక పార్టీపై విమర్శలతో విరుచుకుపడిన వారు అదే పార్టీలో చేరి  సొంత పార్టీఫై దుమ్మెత్తి పోయడం నేటితరం రాజకీయాలలో సర్వసాధారణంగా మారిపోయింది అని చెప్పాలి. అయితే ఇక ఇప్పుడు వల్లభనేని వంశీ స్వరం కూడా ఒక్కసారిగా మారిపోవడం ఆంధ్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారిపోయింది. గతంలో టిడిపిలో కీలక నేతగా కొనసాగిన వల్లభనేని వంశీ ఆ తర్వాత వైసీపీలోకి వచ్చారు.

 గతంలో టిడిపి అభ్యర్థి చంద్రబాబు నాయుడు నారా లోకేష్ లను టార్గెట్ చేస్తూ వల్లభనేని వంశీ ఎంతలా విమర్శలు చేశారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు   లోకేష్ ఒక చవట.. వాడిని చంద్రబాబు ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చో పెట్టాలనుకుంటే ఎలా ఒప్పుకుంటాం. మంగళగిరిలో ఎమ్మెల్యేగానే గెలవలేకపోయాడు ఆ దద్దమ్మ అంటూ వల్లభనేని వంశీ అప్పట్లో షాకింగ్ కామెంట్స్ చేశాడు. కానీ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న వల్లభనేని వంశీ  ఒక ప్రశ్నకు సమాధానం చెబుతూ ఒక తరానికి నచ్చింది మరో తరానికి నచ్చకపోవచ్చు.

 మాకు చంద్రబాబు నాయుడు గారితో పెద్దగా సైతాంతిక విభేదాలు కానీ మనస్పర్ధలు కానీ లేవు. జిల్లా నాయకులు నారా లోకేష్ బాబు గారితో నేను కొడాలి నాని వఇమడలేక వేరే పార్టీ మారాల్సి వచ్చింది. ఆ తర్వాత వెనక్కి తిరిగి రాలేకపోయాం అంతే అంటూ వల్లభనేని వంశీ సమాధానం చెప్పారు. అయితే గతంలో మాట్లాడిన దానికి ఇక ఇప్పుడు మాట్లాడిన దానికి  ఎంతో వ్యత్యాసం ఉంది. ఒక రకంగా వల్లభనేని వంశీ స్వరంలో మార్పు  స్పష్టంగా కనిపిస్తుంది. గన్నవరంలో ఓటమి తప్పదు అని వంశీ ముందే గ్రహించారా.. అందుకే చంద్రబాబు నాయుడు ను ముసలోడు అనడానికి బదులు చంద్రబాబు నాయుడు గారు అని.. లోకేష్ ను చవట దద్దమ్మ అనే బదులు లోకేష్ బాబు గారు అని స్వరం మార్చారా అనేది హాట్ టాపిక్ గా మారింది. అయితే ఇప్పుడు వల్లభనేని వంశీ పార్టీ మారాలనుకున్న కుదిరే ప్రసక్తి లేదని.. ఎందుకంటే వల్లభనేని చేసిన విమర్శలు నేపథ్యంలో టిడిపి హిట్ లిస్టులో వల్లభనేని మొదటి వరుసలో ఉంటారట. దీంతో కొడాలి నాని లాగా గుడ్డిగా పోరాటం చేయడం  తప్ప వల్లభనేని  వంశీకి మరో దారి లేదు అని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు విశ్లేషకులు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ap

సంబంధిత వార్తలు: