ఇందిరా గాంధి పాక్ తో యుద్ధం చేసే ఎన్నికల్లో గెలిచిందా! రాహుల్ జీ !!

పుల్వామా దాడి, ఆ తరవాత సర్జికల్ స్ట్రైక్స్ తో లోక్‌ సభ ఎన్నికల్లో తమకు మరో పాతిక సీట్లు ఎక్కువ వస్తాయని బీజేపీ నేత యడ్యూరప్ప చేసిన వ్యాఖ్యలు రాజకీయ సంస్కార హీనం. ఇదెంత తప్పుడు మాటో, పుల్వామా దాడికి మీరే బాధ్యులు అంటూ ప్రధాని మోదీపై రాహుల్‌ విమర్శలు అంతకంటే హీనాతిహీనం.  అసలు  రాహుల్ గాంధికి తను అధ్హ్యక్షత వహిస్తున్న  కాంగ్రెస్ గత ఎన్నికల చరిత్ర తెలియదనే అనుకోవాలి..

ఎన్నికల కోసం శత్రుదేశాలను వినియోగించుకుని వారితో యుద్ధం చేసి ఎవరైనా ఇప్పటికి అధికారంలోకి వచ్చారా? కాంగ్రేస్ ఇంతవరకెప్పుడైనా అలా అధికారంలోకి వచ్చిందా? అయితే యుద్ధలు అధికార పార్టీలకు ప్రయోజనాలు తెచ్చాయా? అయితే, సైనిక ఘర్షణలు నిజంగానే పార్టీలు అధికారంలోకి రావడానికి దోహదపడతాయా అంటే కచ్చితంగా అవునని జవాబు చెప్పలేం. అయితే, వీటి వల్ల దేశంలో రాజకీయ ముఖ చిత్రంలో మార్పులు జరిగినట్టు గత యుద్ధాలు, సైనిక ఘర్షణల తదనంతర పరిణామాలు తెలియజేస్తున్నాయి ఒక సారి పరిశీలిద్ధాం. 

- దేశ విభజన జరిగిన నాటి నుంచి ఇంత వరకు భారత్‌ పాకిస్తాన్‌ తో నాలుగు సార్లు, చైనాతో ఒకసారి యుద్ధానికి దిగింది.

- శ్రీలంక లో అంతర్యుద్ధం నివారణకు సైనిక జోక్యం చేసుకుంది. 

- వీటి తర్వాత జరిగిన ఎన్నికల్లో అధికార పార్టీకి మళ్లీ విజయం దక్కినా దక్కక పోయినా రాజకీయ సమీకరణాలు గణనీయంగా మారాయి. ఉదాహరణకు భారత్‌ 1962 లో చైనాతో, 1965 లో పాకిస్తాన్‌ తో తలపడింది. 


- చైనా యుద్ధంలో భారత్ ఓడిపోతే, పాకిస్తాన్‌ పై విజయం సాధించింది. ఈ రెండు యుద్ధాలు కూడా 1962, 1967 సార్వత్రిక ఎన్నికల మధ్యనే జరిగాయి. ఆ సమయం లో కేంద్రంలో కాంగ్రెస్‌ అధికారంలో ఉంది. ఈ యుద్ధాల తర్వాత జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఓట్లు, సీట్లు కూడా తగ్గాయి.

- 1971లో జరిగిన బంగ్లాదేశ్‌ కోసం భారత్, పాకిస్తాన్‌ల మధ్య యుద్ధం జరిగింది. ఇందిరా గాంధీ హయాంలో జరిగిన ఈ యుద్ధం తర్వాత జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌ బలం భారీగా పెరిగింది.

- వాజ్‌పేయి నాయకత్వం లోని ఎన్‌డీఏ ప్రభుత్వ కాలంలో కార్గిల్‌ యుద్ధం జరిగింది. దీంట్లో భారత్‌ విజయం సాధించింది. తర్వాత కొన్ని నెలలకు జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ మళ్లీ అధికారమైతే కైవసం చేసుకుంది కాని సీట్లు మాత్రం ఏమీ పెరగలేదు. 

- మూడవ భారత్‌–పాక్‌ యుద్ధం(1971) బంగ్లాదేశ్‌ విముక్తి కోసం జరిగిన ఈ యుద్ధంలో భారత్‌ గెలిచింది. ఇందిరా గాంధీ ప్రధానిగా ఉండగా ఈ యుద్ధం జరిగింది. 1971 ఎన్నికల్లో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పాటైన కొన్ని నెలలకు ఈ యుద్ధం జరిగింది. 

- తర్వాత 1977 లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఏకంగా 158 సీట్లు కోల్పోయింది. 1971 ఎన్నికల్లో 352 సీట్లు సాధించిన కాంగ్రెస్‌ ఈసారి 154 సీట్లతో సరిపెట్టుకుంది. ఈ ఎన్నికల్లో జనతా పార్టీ గెలిచింది. స్వాతంత్య్రం తర్వాత కేంద్రంలో ఏర్పడ్డ తొలి కాంగ్రెసేతర ప్రభుత్వం ఇది.


  • మొదటి భారత్‌–పాక్‌ యుద్ధం(1947) కశ్మీర్‌ యుద్ధంగా పేరొందిన ఇది 1947 అక్టోబర్‌– 1948 డిసెంబర్‌ల మధ్య జరిగింది. ఆ తర్వాత 1952 లో జరిగిన మొదటి లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఘన విజయం సాధించింది.
  • భారత్‌–చైనా యుద్ధం (1962) 1962, అక్టోబర్‌ 20 నుంచి 1962 నవంబర్‌ 21 వరకు జరిగింది. దీంట్లో భారత్‌ ఓడింది. యుద్ధం సమయంలో కాంగ్రెస్‌ అధికారంలో ఉంది. 1962లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌ 361 సీట్లు సాధించింది.


  • రెండో భారత్‌–పాక్‌  యుద్ధం(1965) లాల్‌ బహదూర్‌ శాస్త్రి ప్రధానిగా ఉండగా, 1965లో ఈ యుద్ధం జరిగితే, రెండేళ్ల తర్వాత 1967లో సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్‌ విజయం సాధించి 283 సీట్లతో అధికారం దక్కించుకుంది. అయితే, అంతకుముందు ఎన్నికలతో పోలిస్తే 78 సీట్లు తక్కువ వచ్చాయి.


  • ఐపీకేఎఫ్‌ (1987) శ్రీలంకలో అంతర్యుద్ధాన్ని నివారించడం కోసం శాంతి పరిరక్షక దళాన్ని భారత్‌ అక్కడికి పంపి లంక సైనిక వ్యవహారాల్లో జోక్యం చేసుకుంది. నాటి ప్రధాని రాజీవ్‌ గాంధీ 1991లో హత్యకు గురయ్యారు. ఐపీకేఎఫ్‌ను పంపడానికి ముందు 1984లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌ రికార్డు స్థాయిలో 404 సీట్లు గెలుచుకుంది. ఈ జోక్యం తర్వాత జరిగిన (1989) ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఘోరంగా ఓడిపోయింది.

IPKF in Sri Lanka: War

* కార్గిల్‌ యుద్ధం(1999) బీజేపీ నాయకత్వంలోని ఎన్‌డీఏ ప్రభుత్వం హయాంలో కార్గిల్‌ యుద్ధం జరిగింది. 1999 మే నుంచి జూలై వరకు జరిగిన ఈ యుద్ధంలో భారత్‌దే గెలుపు.ఈ యుద్ధానికి ముందు 1998లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ నాయకత్వంలోని ఎన్‌డీఏ అధికారంలోకి వచ్చింది. కార్గిల్‌ యుద్ధం తర్వాత 2004లో జరిగిన ఎన్నికల్లో బీజేపీకి 138 సీట్లు మాత్రమే వచ్చాయి. అంతకు ముందు ఎన్నికల్లో వచ్చిన సీట్ల  కంటే ఇవి 44 తక్కువ. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ కూడా మెజారిటీ సీట్లు సాధించలేక పోయింది. అయినా కూడా ఇతర పార్టీలతో కలిసి యూపీఏ పేరుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.

కేవలం యుద్ధాలవల్లే రాజకీయపార్టీల తలరాత మారిందని చెప్పడానికి లేదు. ఎందుకంటే ఎన్నికల్లో ఆర్థిక, సామాజికాంశాలు కూడా కీలక పాత్ర పోషిస్తాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: