Viral Video: పెరుగుతున్న హైదరాబాద్ హాస్టల్స్ దారుణాలు! యువకుడిపై పశువులా దాడి చేసిన హాస్టల్ యాజమాన్యం!

Purushottham Vinay
హైదరాబాద్ - ఇండియా హెరాల్డ్: హైదరాబాద్ లో కొన్ని ప్రైవేట్ హాస్టల్స్ ఎంత దారుణంగా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. చాలా మంది స్టూడెంట్స్ తమ చదువులు కోసం, కోచింగ్ ల కోసం, ఇంకా ఉద్యోగులు ఉద్యోగాల కోసం వేరే ఊళ్ల నుంచి హైదరాబాద్కి వచ్చినప్పుడు అక్కడ ప్రైవేట్ హాస్టల్స్ లో ఉంటారు. కానీ కొన్ని హాస్టల్స్ దారుణాతి దారుణంగా ఉంటున్నాయి. వేలకు వేలు ఫీజులు తీసుకుంటూ సరైన వసతి కల్పించకుండా, శుభ్రమైన ఆహారాలు పెట్టకుండా, చిన్న చిన్న రూములిచ్చి, ఒక్కొక్క రూములో ఐదారు మందిని కుక్కుతూ ఆ రూములని సరిగ్గ శుభ్రం చేయకుండా దోపిడీ చేసే హాస్టల్స్ హైదరాబాద్ లో కుప్పలు కుప్పలుగా ఉన్నాయి. డబ్బులు ఇష్టం వచ్చినట్టు వసూళ్లు చేస్తూ సరిగ్గా మైంటైన్ చేయని హాస్టల్స్ చాలా ఉన్నాయి. దాదాపు 90 శాతం పైగా ఇలాంటి చెత్త హాస్టల్స్ హైదరాబాద్ లో ఉన్నాయి. ఇంకా ఏమైన పండుగలు వస్తే ప్రతి హాస్టల్లో ఫుడ్ పెట్టరు. అంతేగాక ఆ హాస్టల్స్ యాజమాన్యం ప్రవర్తన కూడా సరిగ్గా ఉండదు. ప్రస్తుతం హైదరాబాద్ లో ఈ ప్రైవేట్ హాస్టల్స్ స్కామ్ ఎక్కువ అవుతుంది. తాజాగా ఓ విషాద ఘటన వెలుగులోకి వచ్చింది.


పూర్తి వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్లోని సంజీవ రెడ్డి నగర్లో (SR Nagar) ఓ హాస్టల్‌లో ఉంటున్న ఓ యువకుడి దగ్గరకి  అతని ఫ్రెండ్ వచ్చాడు. హాస్టల్ వరకు వచ్చినవాడిని లోపలికి దాకా పిలవకపోతే బాగోదని  రూమ్‌కి తీసుకెళ్లాడు.కాసేపు ఆగాకా తిరిగి బయటకు వస్తున్న క్రమంలో.. హాస్టల్ నిర్వాహకుడు బయటివాళ్లను ఎందుకు లోపలికి తీసుకొచ్చావ్ అని ఆ యువకుడిని అడిగాడు. అతను తన ఫ్రెండ్ అని.. కాసేపు మాట్లాడటానికి వచ్చాడు.. పంపిస్తున్నా అని చెప్పాడు. అంతే..ఆ హాస్టల్ నిర్వాహకుడు ఏదో వాడి కొంపలు అంటుకుపోయినట్లు తిట్ల దండకం అందుకున్నాడు. ఇష్టం వచ్చినట్లు ఆ యువకుడిని బూతులు తిట్టాడు. అసలు హాస్టల్‌లో అతనెందుకు వాష్ రూమ్‌కి వెళ్లాడు అని ప్రశ్నిస్తూ.. నీళ్లు అయిపోవడానికి కారణం మీరే అంటూ దారుణంగా తిడుతూ నిందించాడు.


ఇక ఆ హాస్టల్ నిర్వాహకుడి ప్రవర్తనపై యువకుడు అభ్యంతరం వ్యక్తం చేశాడు.దీంతో హాస్టల్ నిర్వాహకుడు.. తనకు తెలిసినవారిని మరికొంతమందిని పిలిపించి.. యువకుడిపై పశువు లాగా దాడికి తెగబడ్డాడు.పాపం ఆ యువకుడిపై కనికరం లేకుండా రోడ్డుపైకి తీసుకొచ్చి తన్నడం, లాగడం చేశాడు. ఈ దాడిలో పాపం ఆ యువకుడి షర్ట్ చినిగిపోయి, శరీరంపై గాయాలయ్యాయి. అడ్డుకున్న అతడి ఫ్రెండ్‌కి కూడా గాయాలయ్యాయి. హాస్టల్ నిర్వహించేవాడి దౌర్జన్యాన్ని ఇంకా అక్కడ వాడితో పాటు ఉన్న మరో రౌడీ గుంపుని ఎదురుగా ఉన్న మరో హాస్టల్‌లోని యువకులు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.ఆ యువకుడి పై దాడి చేసిన వారిలో ఒక అమ్మాయి కూడా ఉంది. వాళ్ళు చేసిన ఈ దాడికి బాధిత యువకులు ఎస్సార్ నగర్ పోలీసులను ఆశ్రయించారు. ప్రస్తుతం ఆ హాస్టల్ నిర్వాహకుడిపై కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాఫ్తు చేస్తున్నారు.
https://twitter.com/sayesekhar/status/1787752515913625783?t=42szQ0OxrWNPPkMgLBjDSA&s=19

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: