తెలంగాణలో సంచలనం.. పదవికి హరీశ్ రాజీనామా..?

Chakravarthi Kalyan

తెలంగాణ రాజకీయాల్లో మరో కలకలం చోటు చేసుకుంది. టీఆర్‌ఎస్ కీలక నేత కేసీఆర్ మేనల్లుడు హరీశ్ రావు తన పదవికి రాజీనామా చేశారు. అదేంటి హరీశ్ రావు ఇప్పుడు ఏ పదవిలోనూ లేడు కదా.. ఇంకా మంత్రి వర్గం ప్రకటించలేదు కదా అనుకుంటున్నారా..


మంత్రిపదవి లేకపోయినా హరీశ్ రావు తెలంగాణ మజ్దూర్ యూనియన్ గౌరవ అధ్యక్షుడిగా ఉన్నారు. ఇప్పుడు అనూహ్యంగా ఆ పదవికి రాజీనామా చేశారు. పార్టీలోని కీలక నాయకులు ఇలా కార్మిక యూనియన్ నాయకులుగా ఉండటం సాధారణమే. ఇందులో విశేషం ఏమీలేదు.


కానీ ఈ సమయంలో హరీశ్ రావు ఈ పదవికి రాజీనామా చేయడం కలకలం సృష్టిస్తోంది. ఇది దేనికి సంకేతమో అర్థంకాని పరిస్థితి నెలకొంది. కొన్ని రోజుల్లో తెలంగాణ సీఎం కేసీఆర్ మంత్రివర్గాన్ని విస్తరించబోతున్నారు. అందులో కేటీఆర్, హరీశ్ రావులకు చోటు దక్కుతుందా లేదా అన్నది తేలడం లేదు.


కేసీఆర్.... కేటీఆర్, హరీశ్ ఇద్దరినీ మంత్రి వర్గానికి దూరం పెట్టాలని భావిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ సమయంలో హరీశ్ రావు తీసుకున్న నిర్ణయం ముందస్తు అసంతృప్తి ప్రకటనకు చిహ్నమా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సమయం సరిపోక యూనియన్ కార్యక్రమాలపై దృష్టి పెట్టలేకపోవడం వల్లనే రాజీనామా చేస్తున్నానని ఆయన చెబుతున్నా.. ఏదో జరగబోతోందన్న అనుమానం అందరిలోనూ కలుగుతోంది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: