అమరావతీ! కళ్ళు తెరూ! జాగ్రత్త సుమా! ఆ ఇద్దరే ముఖ్యమంత్రికి దిశానిర్దేశం చేస్తున్నారట?

మనకు ఏదైనా విషమ సమస్య వస్తే మన ప్రాణసములతో మాట్లాడతాం చర్చిస్తాం నిర్ణయానికి వస్తాం. అలాగే టిడిపి అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గతంలో తెలంగాణా ఎన్నికల్లో టిడిపి పరిస్థితి సర్వేల ద్వారా ధారుణ పలితాలు వెలువరిస్తున్న పరిస్థితుల్లో తన ప్రాణసములైన ఆంద్రజ్యోతి మేనేజింగ్ డైరెక్టర్ వేమూరి రాదాకృష్ణ, ఆంధ్ర ఆక్టోపస్ గా విశిష్ట విఖ్యాతి గాంచిన విజయవాడ మాజీ పార్లమెంట్ సభ్యులు లగడపాటి రాజగోపాల్ తో సమావేశం నిర్వహించో పిచ్చాపాటీగా మాట్లాడుకొనో? మొత్తం మీద లగడపాటి ప్రత్యేక సర్వేని ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ద్వారా దశలవారిగా ప్రకటించి మహాకూటమి అద్భుత విజయం సాధించబోతుందని తెలిపి, తెలంగాణా జనవాహినిని అయోమయంలో పడేశారు లగడపాటి వారు. తెలంగాణా ప్రజలు లగడపాటి-రాధాకృష్ణ-చంద్రబాబు మాయలో పడలేదు. ఫలితమే ప్రజాకూటమి పాద ధూళి కూడా తెలంగాణాలో పడలేదు.


కొంతమంది వైఫల్యాల నుండి పాఠాలు నేర్చుకున్న విధంగా,  గత వైఫల్యాన్ని పాఠంగా తీసుకొని, ఒక కొత్త వ్యూహ రచనకు శ్రీకారం చుట్టటానికి  అదే ఆ ముగ్గురు అంటే ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, విజయవాడ మాజీ పార్లమెంటేరియన్ లగడపాటి రాజగోపాల్, ఆంద్రజ్యోతి మేనేజింగ్ డైరెక్టర్ వేమూరి రాదాకృష్ణ గతరాత్రి ముఖ్యమంత్రి ఇంట్లో సమావేశంఅయ్యారన్న వార్త  వైసిపి అనుకూల మీడియా వ్యాఖ్య ఆసక్తికరంగా వెలువరించింది.


ఈ సందర్భంలో వీరి పేర్లు రహస్య సమావేశం అనగానే తెలంగాణ ఎన్నికల సమయంలో వీరు సర్వేల పేరుతో నానా హడావుడి చేసి. కాంగ్రెస్,టిడిపిల కూటమి గెలవబోతోందని ప్రచారం చేసిన నేపద్యంలో గుర్తుకు రాగా - ఈ భేటీకి ప్రాదాన్యం ఎంతుందో? ఏ కొత్త రహస్య వ్యూహాలు వీరు ఏపిలో అమలు చేయబోతు న్నారో అని జనంలో కొంత ఉత్సుకత నెలకొంది. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ బలహీన పడుతున్నదని, దానిని మరల జనం లోకి మళ్లీ ఎలా తీసుకువెళ్ళి పట్టాలెక్ఖించాలన్న దానిపై తర్జన భర్జన పడి ఉండ వచ్చని కదనాలు వస్తున్నాయి.


అంతేకాక ఎపిలో కూడా తెలంగాణా తరహాలో మరోసారి సర్వేల గందరగోళం సృష్టించడానికి కూడా వారు పన్నాగం చేసి ఉంటారని వైసిపి స్వంత మీడియా తన అభిప్రాయం చెబుతున్నారు. సమావేశం కూడా సుమారు రెండున్నర గంటలసేపు జరిగిందని ఆ మీడియా సమాచారం.


ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఏపీలో ప్రతిపక్ష పార్టీ అధినేత జగన్ ప్రజల్లోకి దూసుకెళుతున్నారు. ప్రభుత్వ వ్యతిరేకత రోజురోజుకు పెరిగిపోతోంది. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబుకు గెలుపుపై అను మానాలు పెనుభూతాల్లా బలపడుతున్నాయి. ఎన్నికల ముందర ఎన్ని తాయిలాలు ప్రకటించినా ప్రజల ఆదరాభిమానాలు దక్కుతాయా? లేవా? అన్న టెన్షన్ వెంటాడుతోంది. ఈ నేపథ్యంలో చంద్రబాబును రక్షించటానికి చేయడానికి ఇద్దరు రహస్య స్నేహితులు యకాయకీ రంగంలోకి దిగారంటున్నారు. నిన్న రాత్రి రహస్యంగా చంద్రబాబును కలుసుకొని మంతనాలు జరిపారు. వారు ఏం మాట్లాడుకున్నారు అదీ మూడుగంటల సేపు చంద్రబాబుకు ఏం సలహా ఇచ్చారన్నది కూడా చర్చనీయాంశంగా మారింది.


పైన చెప్పుకున్నట్లు చంద్రబాబును కలిసిన వారు ఆషామాషీ వ్యక్తులు కాదు కదా! ఒకరు ఆంధ్రా అక్టోపస్, పేరుతో సర్వేలతో ప్రస్తుత పరిస్థితిని కళ్లకు కట్టినట్టు చూపించే లగడపాటి రాజగోపాల్, ప్రధానంగా రాజకీయాల నుంచి వైదొలిగి ఖాళీగా ఉంటున్న లగడపాటి తెలంగాణ ఎన్నికల తరుణం లో విడుదల చేసిన సర్వేలతో అభాసుపాలయ్యారు, తెలంగాణాలో ప్రజలకు ఈయన పేరు చెపితే ఒక జోకర్ గుర్తొస్తాడు. ఎవరి ప్రోద్బలం తోనే లగడపాటి తప్పుడు సర్వేలు విడుదల చేసి తన విశ్వసనీయత కోల్పోయారో ఆయన్ని నిన్న రాత్రి కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది..


ఇక చంద్రబాబు ఇంటికి లగడపాటితో కలిసి ఒకే కారులో ఆంధ్రజ్యోతి-ఏబీఎన్ ఎండీ వేమూరి రాధాకృష్ణ కూడా వచ్చి కలవడం రాజకీయంగా చంద్రబాబు కోటరీలో కీలక వ్యక్తిగా, మీడియా మద్దతు దారుడుగా ఉన్న రాధాకృష్ణ, లగడపాటితో కలిసి చంద్రబాబును అమరావతిలో కలవడం అత్యంత ప్రాధాన్యం సంతరించు కుంది. చంద్రబాబుకు రాబోయే ఎన్నికల్లో ఎలా వ్యవ హరించాలి? ఎక్కడ ఓడిపోయే అవకాశాలున్నాయి? ఎలా చేస్తే గెలుస్తారనేది దానిపై చర్చ జరిగి ఉంటుందని అమరావతి వర్గాల నుంచి సమాచారం అందు తోంది.  ఏదీ ఏమైనా చంద్రబాబు పుట్టి మునిగే సమయం లో ఇద్దరు అజాత శత్రువులు అతి రహస్యంగా చంద్రబాబుతో మంతనాలు జరపడం, ఆయన్ను కాపాడేందుకు రంగం లోకి దిగడం ఏపీ పాలిటిక్స్ లో చలికాలంలో సెగలు రేపుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: