నిరాడంబరంగా జయరాం కుమార్తె వివాహం..!!

murali krishna
ప్రముఖ నటుడు జయరాం కుమార్తె మాళవిక వివాహం సింపుల్‌గా జరిగింది. నవనీత్‌ గిరిశ్‌తో ఆమె ఏడడుగులు వేశారు. కేరళలోని గురువాయూర్‌లోని ఓ గుడిలో వీరి వివాహం సంప్రదాయబద్ధంగా జరిగింది.ఇరు కుటుంబసభ్యులతో పాటు బాగా దగ్గరి బంధువులు మాత్రమే ఈ పెళ్లికి హాజరయ్యారు. ఈ పెళ్లి ఫొటోలు బయటకురాగా నూతన వధూవరులకు నెటిజన్లు, అభిమానులు శుభాకాంక్షలు చెబుతున్నారు.మలయాళ నటుడు జయరాం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మాలీవుడ్‌ స్టార్‌ హీరో అయిన ఆయన తెలుగు ఆడియన్స్‌కి కూడా సుపరిచితమే.ఈ మధ్య తెలుగులో తండ్రి పాత్రలు చేస్తూ మెప్పిస్తున్నారు. అల్లు అర్జున్‌-త్రివిక్రమ్‌ 'అల వైకుంఠపురంలో' సినిమా తండ్రి పాత్ర పోషించిన ఆకట్టుకున్నారు.ఇటీవల గుంటూరు కారంలోనూ మహేష్‌ తండ్రిగా నటించారు. అలా సౌత్‌లో స్టార్‌ నటుడైన జయరాం ఇంట పెళ్లి భాజాలు మోగాయి.ఆయన కూతురు మాళవిక జయరాం నిన్న పెళ్లి పీటలు ఎక్కింది. నవనీత్‌ గిరిశ్‌తో ఆమె ఏడడుగులే వేశారు.అయితే గుడిలో సింపుల్‌గా జరిగిన ఈ పెళ్లికి ఇరుకుటుంబ సభ్యులు, కొద్ది మంది సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు.కేరళలోని గురువాయిర్‌లోని ప్రముఖ గుడిలో మాళవిక, నవనీత్‌ గిరిశ్‌లు మూడుమూళ్ల బంధంతో ఒక్కటయ్యారు.ఇందుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.
 
కేరళ సంప్రదాయ పద్దతిలో జరిగిన వీరి పెళ్లిపై నెటిజన్లు, ఫ్యాన్స్‌ హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే స్టార్‌ నటుడైన జయరాం కూతురు వివాహం ఇలా గుడిలో సింపుల్‌గా చేయడంతో నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.ఏదేమైన ఆయన సింప్లిసిటిపై ఫ్యాన్స ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇక ఇండస్ట్రీ ప్రముఖుల కోసం నేడు మే 3న కేరళలో స్టార్‌ హోటల్లో గ్రాండ్‌ రిసెప్షన్‌ ఏర్పాటు చేస్తున్నారని సమాచారమ్.ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట హల్‌చల్‌ చేస్తున్నాయి.  మే 3న సినీ ప్రముఖుల కోసం భారీగా రిసెప్షన్‌ ఏర్పాటు చేయనున్నారు. గిరీశ్‌ ప్రస్తుతం అమెరికాలో ఉద్యోగం చేస్తున్నారు. జయరాం తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే! హీరోహీరోయిన్లకు తండ్రి పాత్రలు చేస్తూ అలరిస్తున్నారు. తాజాగా 'గుంటూరు కారం' సినిమాలో మహేశ్‌కు తండ్రిగా నటించారు. ప్రస్తుతం పలు తెలుగు చిత్రాలతో బిజీగా ఉన్నారు.ఇక ఇటీవలే జయరామ్ హీరోగా నటించిన అబ్రహం ఓజ్లర్ సూపర్ సక్సెస్ అయింది. ఈ సినిమాలో అబ్రహం ఓజ్లర్ అనే ఐపీఎస్ ఆఫీసర్‌గా హీరో జయరాం నటనకు ప్రశంసలు అందుకున్నారు.మాళవిక తన గ్రాడ్యూయేట్ ను పూర్తి చేసింది.. వేల్స్‌లో స్పోర్ట్స్ మేనేజ్‌మెంట్‌లో మాస్టర్స్ డిగ్రీని పొందింది. మాళవిక ఇంకా సినిమాల్లోకి రాలేదు. కానీ ఫ్యాషన్ డిజైనింగ్ రంగంలో అడుగు పెట్టింది.. ఆమె భర్త నవనీత్ పాలక్కాడ్‌లోని నెన్మారాలోని కీజెప్పట్ కుటుంబానికి చెందిన గిరీష్ మీనన్, మాజీ యూఎన్ అధికారి వత్సల కుమారుడు.. సీఏ చేశారు.. ప్రస్తుతం వీరిద్దరి పెళ్లి ఫోటోలు వైరల్ అవుతున్నాయి.. ఇక జయరామ్ కొడుకు మ్యారేజ్ కూడా త్వరలో జరగబోతుందని సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: