షాక్: చైతును ఉద్దేశించే.. శోభిత పోస్ట్ చేసిందా..!

Divya
టాలీవుడ్ లో హీరోయిన్గా మంచి పాపులారిటీ సంపాదించుకున్న శోభిత దూళిపాళ్ల అటు టాలీవుడ్, బాలీవుడ్ , కోలీవుడ్ లో పలు సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నది. ఇటీవల ఈ ముద్దుగుమ్మ హాలీవుడ్ లో కూడా పలు సినిమాలలో నటిస్తూ ఉన్నది.. దేవ్ పాటిల్ హీరోగా వచ్చిన హాలీవుడ్ సినిమా మంకీ మ్యాన్.. ఈ చిత్రంలో శోభిత కీలకమైన పాత్రలో నటించింది. ఈ సినిమా ఇటీవల విడుదలై మంచి విజయాన్ని కూడా అందుకున్నది. గత కొన్ని నెలలుగా శోభిత ధూళిపాళ్ల అక్కినేని హీరో నాగచైతన్య తో డేటింగ్ లో ఉన్నారనే రూమర్స్ వినిపిస్తూనే ఉన్నాయి.

 ఈ మధ్యకాలంలో ఈ వార్తలు మరింత వైరల్ గా మారడంతో తాజాగా ఇన్స్టాగ్రామ్ ను ఒక పోస్ట్ షేర్ చేయడం జరిగింది.. ఈ పోస్టులో " అయామ్ నాట్ ఎవరీ వన్ కప్ ఆఫ్ చాయ్ .. అండ్ థట్స్ ఒకే అంటూ రాసుకుంది".. అందుకు అర్థం ఏమిటంటే నేను అందరికీ నచ్చకపోయినా పర్వాలేదు.. అని అర్థమట.. సాధారణంగా ఎవరైనా కప్ ఆఫ్ టి అని రాసుకొస్తారు కానీ ఈ ముద్దుగుమ్మ మాత్రం కప్ ఆఫ్ చాయ్ అని రాసింది.. ఆ చాయ్ అనే పదాన్ని ఇంగ్లీషులో  chai  రాసింది.

అయితే ఇంగ్లీషులో రాసిన chai అనే పదం నాగచైతన్య ను ముద్దుగా అభిమానులు చై అని పిలుస్తూ ఉంటారు.. అయితే ఈ పోస్టుతో కొంత మంది నేటిజెన్స్ నాగచైతన్యను పోలుస్తూ శోభిత ఇలా పోస్ట్ తెలియజేసింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.. ఏది ఏమైనా ప్రస్తుతం శోభిత షేర్ చేసినటువంటి ఈ ఇంస్టాగ్రామ్ పోస్ట్ సోషల్ మీడియాలో మాత్రం చాలా వైరల్ గా మారుతోంది. సమంత, నాగచైతన్య విడిపోయినప్పటి నుంచి శోభిత పేరు చాలా ఎక్కువగా వినిపిస్తూ ఉన్నది.. ఈ విషయం పైన ఎన్నోసార్లు క్లారిటీ ఇచ్చినప్పటికీ కూడా ఇప్పటికీ నాగచైతన్య ,శోభిత రూమర్స్ వినిపిస్తూనే ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: