అల్లుఅర్జున్: చిరంజీవి దెబ్బకు దిగొచ్చిన నాగబాబు..!

Divya
పొలిటికల్ పరంగా మెగా కుటుంబం నిరంతరం వార్తలలో నిలుస్తూనే ఉంది.. సినీ ఇండస్ట్రీలో మెగా కుటుంబానికి,  అల్లు కుటుంబానికి మంచి పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి.. కానీ రాజకీయాలలోకి వచ్చిన తర్వాత విభేదాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.. ఇటీవలే నాగబాబు కూడా పవన్ కళ్యాణ్ కోసం  ప్రచారానికి రాలేదని అల్లు అర్జున్ ని ఉద్దేశిస్తూ ఒక ట్వీట్ చేశారు.. ముఖ్యంగా అల్లు అర్జున్ తన స్నేహితుడు నంద్యాల వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థి రవిచంద్ర కిషోర్ రెడ్డి కి సపోర్ట్ చేస్తూ.. భార్యతో కలసి ఆయన ఇంటికి వెళ్లారు.

దీంతో నాగబాబు మాతో ఉంటూ ప్రత్యర్థులకు పని చేసేవాడు మావాడు అయిన పరాయి వాడే.. మాతో నిలబడే వాడు పరాయివాడైన మా వాడే అన్నట్లుగా ట్వీట్ చేశారు.. దీంతో బన్నీ అభిమానులు సైతం ఒక్కసారిగా నాగబాబు పైన ఫైర్ అయ్యారు.. ఈ విషయం చిరిగి చిరిగి చాట్ అవుతుంటే ఈ సమయంలో చిరంజీవి ఎంట్రీ అయ్యి నాగబాబుకు వార్నింగ్ ఇచ్చినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.. మన కుటుంబాన్ని ఇంకొకరు వేలెత్తి చూపించే విధంగా ఎందుకు సోషల్ మీడియాలో పోస్ట్ చేశావంటూ ఫైర్ అయ్యారట.. మన కుటుంబంలో ఎవరిని కూడా చులకనగా చూపించకూడదని ముఖ్యంగా రాజకీయాల కారణంగా అసలు ఇలా చేయడం తనకు ఇష్టం లేదని కూడా చిరంజీవి నాగబాబుకు వార్నింగ్ ఇచ్చారు.

దీంతో నిన్నటి రోజున ట్విట్టర్ అకౌంట్ ని  డిలీట్ చేసినప్పటికీ మళ్లీ.. ఈ రోజున అల్లు అర్జున్ మీద పెట్టిన ఆ ట్వీట్ ను సైతం డిలీట్ చేశారు నాగబాబు.. డిలీట్ చేయడమే కాదు ఆ ట్వీట్ డిలీట్ చేశానంటూ మరో ట్రీట్ చేశారు నాగబాబు. దీంతో అల్లు అర్జున్ అభిమానులు కాస్త కూల్ అవుతున్నారు.. అంతేకాదు రాబోయే రోజుల్లో కూడా  అల్లు అర్జున్ మీద ఇలాంటి వ్యాఖ్యలు చేయకూడదు అని.. చేస్తే ఖచ్చితంగా అభిమానులు ఊరుకునే ప్రసక్తి లేదంటే తెలియజేస్తున్నారు.. మెగా కుటుంబమంతా పవన్ కళ్యాణ్ గెలుపు కోసం సినీ సెలబ్రిటీలను తోలుకొని వెళ్లి మరీ ప్రచారం చేసినప్పటికీ గెలుస్తారనే ధీమా కనిపించలేదా అంటూ అల్లు అర్జున్ అభిమానులు మెగా కుటుంబాన్ని ఎద్దేవా చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: