ఈ టీ తాగితే ఎంతో ఆరోగ్యంగా ఉంటారు?

Purushottham Vinay
మనలో చాలా మందికి టీ తాగనిదే రోజు గడవదు. అయితే సాధారణ టీ హెల్త్ కి అంత మంచిది కాదు. దానికి బదులు కరివేపాకు టీ తాగితే చాలా హెల్తీగా ఉంటారు. అదెలా చేసుకోవాలి? దానివల్ల కలిగే ప్రయోజనాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ముందుగా మీరు ఒక గిన్నెలో నీరు పోసి మరిగించండి. నీరు మరిగిన తర్వాత, కరివేపాకు ఆకులను వేసి 2 నిమిషాలు ఉడికించాలి. స్టవ్ ఆఫ్ చేసి, టీని 5 నిమిషాలు నానినట్లు ఉంచండి. టీని వడగట్టి, ఒక కప్పులోకి పోయాలి. రుచికి తగినట్లుగా తేనె లేదా నిమ్మరసం కలపండి. వేడిగా లేదా గోరువెచ్చగా తాగండి. ఇందులో ఒక చిన్న ముక్క అల్లం లేదా 2-3 యాలకులను కూడా వేసి ఉడికించవచ్చు.మీరు టీని మరింత గాఢంగా చేయాలనుకుంటే, మీరు ఎక్కువ కరివేపాకు ఆకులను ఉపయోగించవచ్చు.టీని వడగట్టడానికి, మీరు ఫిల్టర్ లేదా సన్నని గుడ్డను ఉపయోగించవచ్చు.ఈ కరివేపాకు టీని రోజుకు ఒకసారి లేదా రెండుసార్లు తాగవచ్చు.కరివేపాకు టీ ఒక రుచికరమైన , ఆరోగ్యకరమైన పానీయం, ఇది అనేక ప్రయోజనాలను అందిస్తుంది.రక్తం పలుచబడే మందులు వాడే వ్యక్తులు కూడా కరివేపాకు టీని తాగడానికి ముందు వైద్యుడిని సంప్రదించాలి.అలాగే గర్భిణీ స్త్రీలు లేదా పాలిచ్చే మహిళలు కరివేపాకు టీని తాగడానికి ముందు వైద్యుడిని సంప్రదించాలి.


ఈ టీ తాగడం వల్ల జుట్టు రాలకుండా ఉంటుంది. అలాగే ఆరోగ్యంగా , ఒత్తుగా పెరుగుతుంది. దీని వల్ల ఎలాంటి జుట్టు సమస్యలు కలగకుండా ఉంటుంది. కరివేపాకు టీ ఒత్తిడి, ఆందోళనలను కూడా తగ్గిస్తుంది. ఇది ఒక రిలాక్సెంట్‌గా పనిచేస్తుంది. ముఖ్యంగా మహిళలు రుతుస్రావ నొప్పిని తగ్గిస్తుంది. ఇది రుతుస్రావ నొప్పి, అసౌకర్యాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. అలాగే ఈ టీతో అధిక బరువు సమస్యకు చెక్‌ పెట్టవచ్చు. శరీరంలోని కొవ్వును కరిగించడంలో ఎంతో సహాయపడుతుంది. అలాగే ఆహారాని త్వరగా జీర్ణం చేస్తుంది. దీని వల్ల జీర్ణక్రియ కూడా మెరుగుపడుతుంది. దీని వల్ల చర్మానికి కూడా ఎంతో ఉపయోగపడుతుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని ఫ్రీ రాడికల్స్‌ నుంచి రక్షిస్తుంది. ఇది ముడతలు, చర్మ వ్యాధులను నివారించడంలో ఎంతో సహాయపడుతుంది. కరివేపాకు టీ తీసుకోవడం వల్ల షుగర్‌ లెవల్స్ కంట్రోల్‌లో ఉంటుంది. దీని వల్ల మీరు ఎలాంటి అనారోగ్య సమస్యల బారిన పడాల్సిన అవసరం లేదు. అలాగే కరివేపాకు టీలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని మెరుగుపరుచుతుంది. దీని వల్ల ప్రమాదకరమైన వ్యాధుల బారిన పడకుండా ఉంటాము.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: