బాలయ్య... బాబీ కాంబో మూవీలో విలన్ ఎవరో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..?

MADDIBOINA AJAY KUMAR
నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం బాబి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీ కి మేకర్స్ టైటిల్ ని ఫిక్స్ చేయకపోవడంతో ఈ మూవీ యొక్క చిత్రీకరణను ఎన్ బీ కే 109 అనే వర్కింగ్ టైటిల్ తో పూర్తి చేస్తూ వస్తున్నారు. ఈ సినిమాను వచ్చే సంవత్సరం సంక్రాంతి కానుకగా విడుదల చేసే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది. ఈ సినిమాలో ఊర్వశి రౌటేలా పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనుండగా ... తమన్ ఈ మూవీ కి సంగీతం అందిస్తున్నాడు.

సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై సూర్య దేవర నాగ వంశీ ఈ మూవీ ని నిర్మిస్తున్నాడు. ఇక ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ కూడా ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ మూవీ షూటింగ్ కొంత భాగం పూర్తి అయిన తర్వాత ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో బాలకృష్ణ ఇన్ని రోజుల పాటు ఎలక్షన్ ల ప్రచారంలో బిజీగా ఉన్నాడు. దానితో ఈ సినిమా షూటింగ్ ఆగిపోయింది.

ఇక మళ్ళీ వచ్చే వారం నుండి ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ కాబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా నెక్స్ట్ షెడ్యూల్ లో ఈ మూవీ లో విలన్ పాత్రలో కనిపించబోతున్న లేడీ క్యారెక్టర్ కూడా జాయిన్ కాబోతున్నట్లు తెలుస్తోంది. ఆమె ఎవరో తెలుసా ..? మరి ఎవరో కాదు కొన్ని రోజుల క్రితమే సలార్ సినిమాలో నటించి ప్రేక్షకులను ఎంతగానో అలరించిన శ్రేయ రెడ్డి.

ఈమె బాలకృష్ణ , బాబీ కాంబో లో రూపొందుతున్న సినిమాలో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించబోతున్నట్లు ఈమె పాత్ర ఈ సినిమాకే హైలైట్ గా ఉండబోతున్నట్లు ఓ వార్త వైరల్ గా మారింది. నిజంగానే ఈ బ్యూటీ కనుక ఇందులో నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించినట్లు అయితే ఈ సినిమాకు ప్రేక్షకుల్లో మరింత మంచి బజ్ ఏర్పడే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: