మొగిలయ్య విషయంలో సూపర్ అనిపించుకున్న తెలంగాణ ప్రభుత్వం?

Purushottham Vinay
ఆర్ధిక సమస్యల కారణంగా కూలి పనులకు వెళ్తున్నట్లుగా పద్మశ్రీ అవార్డు గ్రహీత కళాకారుడు మొగిలయ్య చెప్పడం ఆయన కూలి పనులు చేస్తున్న వీడియోలు బయటకు రావడంతో నెట్టింటా తెగ వైరల్ అయ్యాయి.మొగిలయ్య  తెలంగాణాలో అద్భుతమైన కళాకారుడు. గిరిజన సంగీత పరికరాలతో వాయిద్యం అందించడంలో ఆయన దిట్ట.భీంలా నాయక్ సినిమా ద్వారా ఆయన ప్రేక్షకులకు బాగా చేరువయ్యారు.అలాంటి ఆయన తన కుటుంబ పోషణతో పాటు తనకు కుమారుడికి ఉన్న అనారోగ్య సమస్యల వల్ల మందుల కోసం ఇలా కూలి పనులు చేయాల్సి వస్తోందని చెప్పి ఆశ్చర్యపరచారు.దాంతో కవులు కళాకారులకు ఇదేనా చివరికి జరిగేది అన్న చర్చ నెట్టింటా మొదలైంది. పద్మశ్రీ అవార్డు అందుకోవడం అంటే నిజంగా సామాన్య విషయం కాదు. దేశంలో అత్యున్నత పౌర పురస్కారం అందుకున్న మొగిలయ్య గొప్ప కళాకారుడు అయ్యి కూడా చివరికి ఇలా తన జీవితాన్ని వెళ్ళబుచ్చుతున్నారా అని సోషల్ మీడియా ద్వారా అంతా ఆవేదనకు గురయ్యారు.అయితే దీని మీద తెలంగాణా ప్రభుత్వం ఒక ప్రకటన విడుదల చేసింది.


దాని ప్రకారం చూస్తే క్రమం తప్పకుండా మొగిలయ్యకు పెన్షన్ ప్రతీ నెలా చెల్లిస్తున్నట్లుగా సీఎం రేవంత్ రెడ్డి సీపీఆర్వో అయిన అయోధ్యరెడ్డి తెలిపారు. అంతే కాదు మార్చి 31 వ తేదిన కూడా ఆయన ఖాతాలోకి 20 వేల రూపాయల పెన్షన్ జమ చేసినట్లుగా వెల్లడించారు.ఈ మేరకు ఆయన X లో పోస్ట్ కూడా చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కవులు కళాకారులను ఎపుడూ గౌరవిస్తుందని ఆయన పేర్కొన్నారు. అయితే ఏప్రిల్ నెల లో మాత్రం పెన్షన్ కొంచెం ఆలస్యం అవుతుందని మొగిలయ్యకు ముందే ఫోన్ చేసి చెప్పినట్లుగా కూడా అధికారులు చెప్పడం విశేషం.మొత్తం మీద ఇరవై వేల రూపాయలు పెన్షన్ ప్రతీ నెలా మొగిలయ్యకు తెలంగాణ ప్రభుత్వం నుంచి రావడం మంచి విషయంగానే చూడాలి.మరి మొగిలయ్య కూలి పనులకు వెళ్తున్నారు. ఎందుకంటే ఆర్ధిక ఇబ్బందులని చెబుతున్నారు. పెన్షన్ ఆలస్యం అయింది దాంతోనే ఆయన ఇబ్బంది పడి ఇలా కూలి పనులకు వెళ్తున్నారా లేక ఆయనకు ఈ సొమ్ము కూడా సరిపోవడం లేదా అన్న చర్చ ఇప్పుడు సాగుతోంది. ఏది ఏమైనా కూడా తెలంగాణా ప్రభుత్వం కళాకారులను ఇలా గౌరవించడం అన్నది అభినందించదగ్గ విషయం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: