ఏపీ: ఆ జనసేన అభ్యర్థికి గెలుపు వరించేనా..?

Divya
కూటమిలో భాగంగా అటు టిడిపి, జనసేన, బిజెపి పార్టీలో ముకుమ్మడిగా ప్రచారం చేస్తూ ముందుకు వెళుతున్నాయి.. అటు వైసీపీ పార్టీ సింగిల్ గా అన్ని నియోజకవర్గాలను చుట్టేస్తే ముందుకు వెళ్తున్నారు జగన్ అలాగే పలు నియోజకవర్గాల్లో అభ్యర్థులు కూడా జోరుగాని ప్రచారం చేస్తున్నారు.. ఈసారి ఎన్నికలు కూడా చాలా అన్ని పార్టీలకు కీలకంగా మారనున్నాయి.. ముఖ్యంగా జనసేన పొత్తుల భాగంగా 21 సీట్లను తీసుకున్నారు.. అందులో బొలిశెట్టి శ్రీనివాస్.. తాడేపల్లి గూడానికి సంబంధించి జనసేన అభ్యర్థి. ఎంతో కష్టపడ్డారు.. వాస్తవంగా పార్టీని నమ్ముకొని ఉన్నారు. పార్టీల జెండాలను కూడా మార్చలేదు. పవన్ కళ్యాణ్ ని ఒప్పించారు.. కేడరని చాలా స్ట్రాంగ్ గా నిలబెట్టుకున్నారు.

తను ఇప్పుడు తెలుగుదేశం, బిజెపి ,జనసేన పొత్తులో అనేక మంది నష్టపోతే.. ఆయనను మాత్రం అక్కడ నిలబెట్టుకోగలిగారు పవన్ కళ్యాణ్. దీంతో ఆయనకు సీటు కూడా ఖరారు అయింది.. గతంలో బిజెపి పార్టీ నుంచి మాణిక్యరావు గెలిచినటువంటి సీటు కాబట్టి.. అక్కడ ఆయనకు  విజయ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎన్డీఏకు గెలుపు అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి. ఇలాంటి సందర్భంలో ఆయనను దెబ్బ కొట్టడానికి స్కెచ్ లో భాగంగా  ముగ్గురు ఒకే పేరుతో కలిగినటువంటి.. శ్రీనివాసరావు అనే పేరుతో.. నామినేషన్లు వేయడం జరిగిందట.. అందులో మొదటిది 1).శ్రీనివాస్.. గుర్తు బకెట్, 2).మరొక అభ్యర్థి శ్రీనివాస్.. గుర్తు పెన్ స్టాండ్, మరొక అభ్యర్థి శ్రీనివాస్.. గుర్తు గాజు గ్లాస్.

ఇలాగ కొత్త ఎత్తుల మధ్యన.. కథలు నడుస్తున్నాయి. అట్లాంటి వాటిని తిప్పి కొట్టడమే ఎలాగో తనకు తెలుసని చెబుతున్నారు బోల్లి శెట్టి శ్రీనివాస్.. వాస్తవానికి ఇక్కడే కాకుండా చాలా చోట్ల కూడా ఇలాంటి పేర్లతో చాలామంది అభ్యర్థులు చాలా చోట్ల నిలబడుతున్నారు.. ముఖ్యంగా తాడేపల్లి లో సీఎం జగన్ ఆఫీసు కూడా అక్కడే ఉండడం గమనార్హం. ఈసారి ఎన్నికలలో ఎవరు గెలుస్తారో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: