ఏనుగు తొండాన్ని పట్టుకున్న మొసలి.. చివరికి ఏం జరిగిందో చూడండి?

praveen
సాధారణంగా నీళ్లలో ఉండే మొసలికి ఎంత శక్తి ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అడవికి రారాజు సింహం అయినప్పటికీ మొసలి నీళ్లలో ఉంది అంటే చాలు నీటిలో కాలు పెట్టడానికి భయపడిపోతూ ఉంటుంది సింహం. అడవిలోని అన్ని జంతువులను దారుణంగా వేటాడి తినే క్రూర మృగాలను సైతం మొసలి తన ఆహారంగా మార్చుకుంటూ ఉంటుంది అని చెప్పాలి. అందుకే ఇక ఎక్కడైనా సరస్సు ఒడ్డున నిలబడి దాహార్తిని తీర్చుకునేటప్పుడు క్రూర మృగాలు కూడా ఎంతో అలర్ట్ గా ఉంటాయి. ఎక్కడ మొసలి దాడి చేస్తుందో అని భయపడిపోతూ ఉంటాయి అని చెప్పాలి.

 అయితే ఒక్కసారి నీటిలో ఉన్న మొసలి నోటికి చిక్కితే ఏ జంతువు అయినా సరే ప్రాణాల మీద ఆశలు వదిలేసుకోవాల్సిందే. కానీ కొన్ని కొన్ని సార్లు మాత్రం పరిస్థితులు ఇందుకు విరుద్ధంగా ఉంటాయి. ఏకంగా మొసలి దాడి చేసిన కొన్ని జంతువులు ఎంతో అలవోకగా విడిపించుకుని మొసలినే చావు దెబ్బ కొడుతూ ఉంటాయి. అలాంటి వాటిలో ఇక భారీ ఆకారం బలం కలిగి ఉండే ఏనుగులు కూడా ఒకటి అన్న విషయం తెలిసిందే. సాధారణంగా మొసళ్లు ఏనుగులపై అటాక్ చేయడానికి కాస్త వెనకడుగు వేస్తాయి. ఎందుకంటే ఇక ఏనుగులు వారి ఆకారంతో అలవోకగా తప్పించుకోవడమే కాదు మొసలి ప్రాణాలు ప్రాణాలు కూడా తీసేస్తూ ఉంటాయి అని చెప్పాలి.

 అయితే ఇక ఇప్పుడు ఇలాంటి తరహా వీడియోనే ఒకటి వైరల్ గా మారిపోయింది. జాంబిజి నేషనల్ పార్క్ లో ఒక ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. కొన్ని ఏనుగులు నీళ్లు తాగడానికి ఒక నది వద్దకు వస్తాయ్. అయితే నది ఒడ్డున నిలబడి ఏనుగులు నీళ్లు తాగుతున్న సమయంలో అక్కడే ఉన్న ఒక మొసలి ఎటాక్ చేయడానికి రెడీ అవుతుంది. నదిలో కాస్త లోతుకు వచ్చి నీళ్లు తాగుతున్న ఒక ఏనుగుపై దాడి చేస్తుంది. ఏకంగా ఏనుగు తొండాన్ని పట్టుకొని లోపలికి లాగుతుంది. అయితే ఇలా  ఏనుగు తొండాన్ని  పట్టుకోవడంతో అది విలవిలలాడుతుంది. వెంటనే తేరుకొని మొసలి నుంచి తప్పించుకోవడానికి ఇక ఒడ్డుకు లాక్కొని వస్తుంది. గట్టిగా విదిలించుకోవడంతో పాటు మొసలి పై దాడి చేయడానికి ప్రయత్నిస్తుంది. ఇక అలాగే తొండాన్ని పట్టుకొని ఉంటే ప్రాణాలు పోతాయని గ్రహించే మొసలి వెంటనే వదిలేస్తుంది. దీంతో ఏనుగు అక్కడి నుంచి వెళ్ళిపోగా మొసలి తన దారిన తాను మళ్ళీ నదిలోకి వెళ్ళిపోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: