ఆ ఊర్లో ఎప్పుడు వర్షమే పడదట.. ఎందుకో తెలుసా?

praveen
సాధారణంగా ఏ ప్రాంతంలో అయినా కాలానుగుణంగా వాతావరణ పరిస్థితులు మారిపోతూ ఉంటాయి అన్న విషయం తెలిసిందే. వర్షాకాలంలో ఎక్కువగా వర్షాలు పడటం చూస్తూ ఉంటాం. ఎండాకాలం వచ్చిందంటే చాలు పగబట్టినట్లుగానే ఎండలు దంచి కొడుతూ  ఉంటాయి. ఇక చలికాలంలో ఇంటి నుంచి కాలు బయట పెట్టాలంటేనే భయపడేంతగా ఎముకలు కొరికే చలి ఎప్పుడూ వేధిస్తూ ఉంటుంది. ఇది అక్కడ ఇక్కడ అని తేడా లేదు ప్రతిచోట కూడా ఇలాంటి పరిస్థితి నెలకొంటుంది.

 కానీ కొన్ని ప్రాంతాలలో మాత్రం సాధారణం కంటే భిన్నంగా పరిస్థితులు నెలకొంటూ ఉంటాయి. మరి ముఖ్యంగా కప్పబడి ఉన్న హిమాలయాలు లాంటి ప్రాంతాలలో ఇక కాలంతో సంబంధం లేకుండా ఎప్పుడు చల్లటి వాతావరణం ఉంటుంది అన్న విషయం తెలిసిందే. అయితే అక్కడ ఎండలు కొట్టిన వానలు పడిన  వాతావరణంలో మాత్రం ఎలాంటి మార్పు రాదు. అయితే ఏకంగా ఇప్పుడు వరకు ఒక్క చుక్కవర్షం కూడా పడని ప్రాంతం ఉంది అంటే ఎవరైనా నమ్ముతారా.. అదేంటి వర్షం పడని ప్రాంతం కూడా ఉంటుందా అని తిరిగి ప్రశ్నిస్తారు ఎవరైనా.

 కానీ ఇక్కడ వర్షం చుక్క కూడా పడని ఒక ప్రాంతం ఉంది. అదే యేమన్ రాజధాని అయినా సన పరిధిలోని ఆల్ హుతైబ్ గ్రామం. ఇక్కడ ఇప్పుడు వరకు ఎప్పుడు కూడా వర్షం పడలేదు. సాధారణంగా మేఘాలకి భూమికి రెండు కిలోమీటర్లు దూరం ఉంటుంది. కానీ ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఊరు మాత్రం భూమి ఉపరితలానికి ఏకంగా 3200 మీటర్ల ఎత్తులో ఉంది. అంటే దాదాపు మూడు కిలోమీటర్ల పైనే. ప్రభుత్వ అక్కడి ప్రజలకు టాంకర్లలో నీటిని సరఫరా చేస్తూ ఉంటుంది. ఇక సాయంత్రం నుంచి సూర్యోదయం వరకు అక్కడ మంచు పరుచుకుని ఉంటుంది. ఉదయం సమయంలో మాత్రం ఎండలు మండిపోతూ ఉంటాయి. అయితే ఈ గ్రామంలో చాలా మంది ముంబై నుంచి వలస వెళ్లిన బుర్హానుద్ధిన్ అనుచరులు ఆయన వారసులే కావడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: