పేరెంట్స్ ఓటేస్తే.. పిల్లలకి మార్కులు.. స్కూల్స్ వినూత్నమైన ఆఫర్?

praveen
ప్రస్తుతం దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికల హడావిడి నెలకొంది అన్న విషయం తెలిసిందే  అయితే పలు రాష్ట్రాలలో ఇప్పటికే పోలింగ్ ముగిసింది. ఈ క్రమంలోనే ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ నెలకొంది. ఇంకొన్ని రాష్ట్రాలలో ఇక ఇంకా పోలింగ్ జరగని నేపథ్యంలో అక్కడ ప్రచారం హోరు కనిపిస్తోంది. ఈ క్రమంలోనే ఒకవైపు ఇక ప్రచారంలో దూసుకుపోతున్న అభ్యర్థులందరూ కూడా తమకే ఓటు వేయాలి అంటూ ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. ఇంకోవైపు ఎన్నికల అధికారులు ప్రతి ఒక్కరూ వచ్చి ఓటు వేసేలా అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు.

 ఓటు యొక్క ఆవశ్యకతను తెలియజేస్తూ ఉన్నారు అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఇక ఎన్నికల హడావిడి నేపద్యంలో.. కొన్ని ప్రైవేట్ సంస్థలు కూడా ఓటు హక్కు పై అవగాహన కల్పించేందుకు ఓటర్లు ఇక పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చేందుకు ఎన్నో వినూత్నమైన కార్యక్రమాలు చేపడుతున్నారు. కొన్ని రెస్టారెంట్లు ఓటు వేసిన వారికి ఇది ఫ్రీ అది ఫ్రీ అంటూ ఆఫర్లు ప్రకటిస్తూ ఉన్నాయి. అయితే ఇప్పుడు యూపీలో మరికొన్ని రోజుల్లో లోక్సభ ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో ఇక అక్కడి  స్కూల్స్ వినూత్నమైన ఆఫర్లు ప్రకటిస్తూ ఉన్నాయి అని చెప్పాలి.

 ఇలా ఎన్నికల పోలింగ్ శాతం పెంచడానికి యూపీలోని లక్నోలో స్కూల్ యాజమాన్యాలు ప్రకటిస్తున్న ఆఫర్లు ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయాయ్. తమ స్కూళ్లలో చదివే పిల్లల తల్లిదండ్రులు ఓటు వేస్తే విద్యార్థులకు ఒక్కొక్కరికి 10 మార్కులు అదనంగా వేస్తాము అంటూ సెయింట్ జోసెఫ్ విద్యాసంస్థల యాజమాన్యం ఇటీవల ప్రకటించింది. అలాగే తమ స్కూళ్లలో పనిచేసే సిబ్బంది ఓటు వేస్తే వారికి ఒక్కరోజు జీతం అదనంగా ఇవ్వనున్నట్లు ప్రకటించింది. కాగా అక్కడ ఈనెల 21వ తేదీన పోలింగ్ జరగబోతుంది అని చెప్పాలి. ఇలా ప్రైవేట్ సంస్థలు కూడా ఓటు హక్కు పై అవగాహన కల్పిస్తూ ఓటర్లను పోలింగ్ కేంద్రాలకు రప్పించేందుకు చేస్తున్న ప్రయత్నాలపై ప్రశంసలు కురుస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: