స్టార్ హీరో మీద మనసు పారేసుకున్న సురేఖావాణి కూతురు..!!

murali krishna
సాధారణంగా సినీ రంగంలో ఉన్న చాలా మంది సెలెబ్రిటీల పిల్లలు మామూలుగానే పాపులర్ అవుతుంటారు. కానీ, కొందరు మాత్రం సెన్సేషన్‌గా మారుతుంటారు. అలాంటి వారిలో సీనియర్ నటి సురేఖ వాణి కుమార్తె సుప్రిత ఒకరు.సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్గా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . ఒక పాన్ ఇండియా హీరోయిన్ ఒక స్టార్ హీరోయిన్ రేంజ్ తో దూసుకుపోతూ ఉంటుంది .ఒక్క సినిమా కూడా చేయకుండానే సోషల్ మీడియా సెన్సేషన్ గా అవతరించింది సుప్రీత. తాజాగా ఓ స్టార్ హీరో భర్తగా కావాలని మనసులో కోరిక బయటపెట్టింది. సుప్రీత పోస్ట్ వైరల్ అవుతుంది.సినీ జంట సురేష్ తేజ - సురేఖ వాణి కూతురిగా సుప్రిత చిన్న వయసులోనే ప్రపంచానికి తెలిసింది. అలా టీనేజ్‌లో ఉన్నప్పుడే ఈ అమ్మడు తనదైన రీతిలో అలరించి సత్తా చాటింది. ముఖ్యంగా యూట్యూబర్‌గా సుప్రిత ఎనలేని క్రేజ్‌ను దక్కించుకుంది. అలాగే, అందంతోనూ మెప్పిస్తూ ఓ రేంజ్‌లో హాట్ టాపిక్ అయింది. ఫలితంగా ఈ చిన్నదాని పేరు రీసౌండ్ వచ్చింది.2019లోనే సుప్రిత 'మనీ మైండెడ్ గర్ల్‌ఫ్రెండ్' అనే షార్ట్ ఫిల్మ్‌తో నటనా ప్రయాణాన్ని మొదలు పెట్టింది. ఇందులో తనదైన అందం, అభినయంతో అలరించింది. ఆ తర్వాత 'అవర్స్ వర్సెస్ అదర్స్', 'వెళ్లిపో', 'గాయత్రి పోతే పోవే' అనే కవర్ సాంగ్‌లలో మెరిసింది. ఇవన్నీ సూపర్ హిట్ అవడంతో ఇలాగే కంటిన్యూ చేస్తూ యూట్యూబర్‌గా సెన్సేషన్ అయింది.తాజాగా సుప్రీత అభిమానులతో చిట్ చాట్ చేసింది . దానికి సంబంధించిన స్క్రీన్ షాత్స్ కూడా వైరల్ గా మారాయి . అయితే ఇదే క్రమంలో ఆమె మీరు పెళ్లి కానీ ఏ హీరోని మన ఇండస్ట్రీలో పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు..? అనే విధంగా నెటిజన్స్ ప్రశ్నిస్తారు.
సుప్రితా ఏం మాత్రం సిగ్గుపడకుండా.. మొహమాట పడకుండా టాలీవుడ్ ఇండస్ట్రీలో రౌడీ హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న విజయ్ దేవరకొండ పేరు చెబుతుంది . సోషల్ మీడియాలో దీనికి సంబంధించిన వార్త బాగా వైరల్ గా మారింది . ఇంకేముంది విజయ్ దేవరకొండను పెళ్లి చేసుకుంటుందేమో అంటూ కొంతమంది నిజంగానే పెళ్లి చేసుకోవడానికి పోవిడలు వచ్చాయేమో అంటూ దారుణాతి దారుణంగా సుప్రితను ట్రోల్ చేస్తున్నారు . మరి కొందరు చేసుకుంటే తప్పేంటి అనే విధంగా కూడా ప్రశ్నిస్తున్నారు . మొత్తానికి సుప్రీత చేసిన ఒక్క ఆన్సర్ ఇప్పుడు రౌడీ హీరో విజయ్ దేవరకొండ అలాగే సుప్రిత పేర్లు సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అయ్యేలా చేస్తున్నాయి.సుప్రీత హీరోయిన్ గా కూడా ఛాన్స్ పట్టేసింది. బిగ్ బాస్ ఫేమ్ అమర్ దీప్ కి జంటగా ఓ రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ చేస్తుంది. ఈ మూవీ షూటింగ్ జరుపుకుంటుంది. త్వరలో హీరోయిన్ గా సిల్వర్ స్క్రీన్ పై సందడి చేయనుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: