పిన్నెల్లి ప్లాన్‌ : హైదరాబాద్‌ వయా గోవా నెక్ట్స్‌ దుబాయ్‌ ?

Veldandi Saikiran

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఫలితాల ఉత్కంఠత నేపథ్యంలో ఇప్పుడు అందరి చూపు మాచర్ల నియోజకవర్గమైన పడింది. మంగళవారం రాత్రి మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి సంబంధించిన ఒక వీడియో ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలనే కాదు దేశాన్ని మొత్తం కుదిపేస్తోంది. మాచర్ల నియోజకవర్గంలోని ఓ పోలింగ్ కేంద్రంలోకి దూసుకు వెళ్లిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి... ఏకంగా అందులో ఉన్న ఈవీఎంలను ధ్వంసం చేశాడు.
నేల కేసి గట్టిగా కొట్టేశాడు. అడ్డు వచ్చిన అధికారులపై దాడి చేసేందుకు కూడా ప్రయత్నించాడు ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి. అడ్డుకున్న తెలుగుదేశం నాయకులపై కూడా దాడి చేసే ప్రయత్నం చేశారు పిన్నెల్లి అనుచరులు. అయితే దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు దేశవ్యాప్తంగా వైరల్ గా మారింది. ఈ ఇన్సిడెంట్ పై వెంటనే స్పందించిన ఎన్నికల సంఘం... ramakrishna REDDY' target='_blank' title='పిన్నెల్లి రామకృష్ణారెడ్డి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పై యాక్షన్ తీసుకునేందుకు సిద్ధమైంది.
ఎమ్మెల్యే పిన్నెల్లి అరెస్టుకు రంగం సిద్దం చేసింది ఎన్నికల సంఘం. ఇందులో భాగంగానే... పిన్నెల్లి సోదరుల కోసం గాలింపు బృందాలు హైదరాబాద్‌ కు వెళ్లాయి.హైదరాబాదుకు వెళ్లిన గాలింపు బృందాలు...ఇప్పటికే ramakrishna REDDY' target='_blank' title='పిన్నెల్లి రామకృష్ణారెడ్డి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కారు డ్రైవర్‌ ను అరెస్ట్‌ చేశాయి. అయితే... ఎమ్మెల్యే పిన్నెల్లి విదేశాలకు వెళ్తారని పోలీసులకు కొత్త అనుమానం వచ్చిందట. మొత్తం మూడు చట్టాల పరిధిలో పది సెక్షన్లతో పిన్నెల్లి మీద కేసు నమోదు చేశారు పోలీసులు. ఐపీసీ, ఆర్పీ, పీడీపీపీ చట్టాల పరిధిలో సెక్షన్లను నమోదు చేశారు. IPC కింద 143, 147, 448 427, 353, 452, 120b సెక్షన్లతో పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై కేసు నమోదు చేశారు పోలీసులు.
PD PP చట్టం కింద మరో కేసు నమోదు....ఆర్పీ యాక్ట్ కింద 131, 135 సెక్షన్ల నమోదు అయింది. ఈ నెల 20వ తేదీనే పిన్నెల్లిపై కేసు నమోదు చేసినట్లు చెబుతున్నారు పోలీసులు. అయితే.. ప్రస్తుతం హైదరాబాద్‌ లో ఉన్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డి...విదేశాలకు వెళ్లేందుకు పెద్ద స్కెచే వేశాడట. హైదరాబాద్ నుంచి గోవా లేదా ముంబై పారిపోయేందుకు ప్లాన్ వేశాడట ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణ రెడ్డి. ఇక అక్కడి నుంచి విదేశాలకు వెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నాడట. అందుకే NH 65 హైదరాబాద్- ముంబై నేషనల్ హైవేపై పిన్నెల్లి వాహనాలు వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. పక్కా సమాచారంతో పిన్నెల్లిని ఫాలో అవుతున్నారట ఏపీ పోలీసులు. ఇక దీనిపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: