జగన్: పద్మవ్యూహంలో చిక్కకుండా భారీ ప్లాన్.. సీఎం అవడం ఖాయం..?

Divya
2019 ఎన్నికల తర్వాత తెలుగుదేశం పార్టీతో తీవ్రంగా విభేదిస్తూ జనసేన పార్టీ మాట్లాడుతూ ఉండేది.. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ కూడా అదే మాట్లాడుతోంది. అయితే ఈ మూడు పార్టీలు ఒకటే.. గత ఎన్నికల్లో కూడా విడివిడిగా ఉన్నట్టు ప్రవర్తించారు కానీ వీరు ముగ్గురు ఒకటే అంటూ ప్రచారం చేసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి. అప్పుడు పార్టీల వారు కూడా అదేంటి సార్.. జనాలు నవ్వుతారు అంటూ కామెంట్ చేశారు.. అయితే మీరు చూస్తూ ఉండండి కచ్చితంగా అదే జరుగుతుంది అంటూ వారికి అడ్డు చెబుతూ వచ్చారు జగన్మోహన్ రెడ్డి.
చివరికి జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాటే నిజమయింది.. 2024 ఎన్నికలలో ఈ మూడు పార్టీలు పొత్తు పెట్టుకున్నాయి.. ఈ సందర్భంలో ఈ పొత్తు జరుగుతుందని.  పురందేశ్వరి బిజెపి అధినాయకత్వంతో  ఈసీ పై ఒత్తిడి తీసుకొస్తూ.. తనను డబ్బులు పంచనీయకుండా చేస్తుంది అని.. వాళ్ల డబ్బులు పంపిణీ చేసి.. తమ డబ్బులను పంపిణీ చేయకుండా చేస్తుంది అని ముందస్తుగానే ప్రిపేర్ అయ్యారు జగన్మోహన్ రెడ్డి. . అందుకే ముందస్తుగానే ఆయా నియోజకవర్గాలకు డబ్బు పంపించేశారు జగన్మోహన్ రెడ్డి. అయితే ఎన్నికల షెడ్యూల్ కంటే ముందే జగన్మోహన్ రెడ్డి ముందస్తుగా ఆలోచించి డబ్బులను ఆయా నియోజకవర్గాలకు పంపించి తన తెలివి తేటలను మరొకసారి నిరూపించుకున్నారు.
ప్రతి అభ్యర్థి దగ్గరికి డబ్బులు చేరిపోయాయి. డబ్బు లేదు అని ఒక వైయస్సార్ సిపి అభ్యర్థి కూడా చెప్పనంతగా ఆయన డబ్బులు చేర్చేసినట్లు సమాచారం. ముఖ్యంగా తన దగ్గర ఎంత డబ్బు ఉందో తెలుసుకొని.. మిగతా డబ్బును సర్దుబాటు చేసుకొని.. ముఖ్యంగా ఒక్కొక్క ఎమ్మెల్యే కాండిడేట్ పరిధిలో రూ .30 నుంచి రూ.35 కోట్లు.. లక్షన్నర ఓట్లకి రూ .2000 చొప్పున.. పంపిణీ చేయడం.. లాంటి విషయాలను జగనే స్వయంగా మానిటర్ చేశారని.. ప్రస్తుతం అక్కడ పరిశీలించిన వారు చెబుతున్న సమాచారం ఇది. మొత్తానికైతే జగన్ చేసిన ముందస్తు ఊహాగానాలు ఆయనను పక్కా సీఎంను చేస్తాయి అనడంలో సందేహం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: