అనసూయ భర్త సుశాంక్ ఎలాంటి వాడో తెలుసా..??

murali krishna
అనసూయ భరద్వాజ్ ప్రస్తుతం ఫ్యామిలీతో కలిసి వెకేషన్ ఎంజాయ్ చేస్తుంది. ఆమె పుష్ప 2లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీలో అనసూయ తన షూటింగ్ పార్ట్ కంప్లీట్ చేసుకున్నట్లు సమాచారం.దీంతో భర్త సుశాంక్ భరద్వాజ్, పిల్లలతో కలిసి టూర్ కి వెళ్ళింది అనసూయ. దానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు అనసూయ షేర్ చేస్తూ వచ్చింది. తాజాగా ఆమె పంచుకున్న వీడియోలో సుశాంక్ భరద్వాజ్ స్పెషల్ టాలెంట్ ఒకటి బయటపడింది.అనసూయ మల్టీ టాలెంటెడ్ అని తెలిసిందే. ఆమె భర్తలో కూడా అనేక ప్రత్యేకతలు ఉన్నాయి. అవేంటో తెలిస్తే ఆశ్చర్యపోతారు. సుశాంక్ ఓ ప్రైవేట్ జాబ్ చేస్తున్నారు. ఆయన ప్రొఫెషనల్ బైకర్. మోటర్ సైకిల్ క్లబ్ మెంబర్. సుదూర ప్రాంతాలకు తోటి రైడర్స్ తో ట్రావెల్ చేయడం ఆయనకు ఇష్టం. తరచు హిల్ స్టేషన్స్ లేదా టూరిస్ట్ స్పాట్స్ కి ప్రయాణం చేస్తూ ఉంటారు. ఆయన వద్ద హై సీసీ కాస్ట్లీ బైకులు ఉన్నట్లు సమాచారం.సుశాంక్ లో మంచి సింగర్ కూడా ఉన్నాడనే విషయం వెలుగులోకి వచ్చింది.అనసూయ పెద్ద అబ్బాయి జన్మ దిన వేడుకలు వెకేషన్ లో జరిపారు. బర్త్ డే నైట్ క్యాంప్ ఫైర్ ఏర్పాటు చేశారు. ఓ వ్యక్తి గిటార్ ప్లే చేస్తున్నారు. అతను పాట పాడుతుండగా సుశాంక్, అనసూయ కూడా అతనితో కలిసి పాడారు. ఆ హిందీ మెలోడీ సాంగ్ ని సుశాంక్ చాలా అద్భుతంగా పాడాడు.దీనికి సంబంధించిన వీడియో తన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది. దీంతో సుశాంక్ లో ఈ స్పెషల్ టాలెంట్ కూడా ఉందా అని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇక అనసూయ కెరీర్ విషయానికొస్తే .. యాంకరింగ్ కి గుడ్ బై చెప్పి నటిగా రాణిస్తుంది. పలు సినిమాల్లో కీలక పాత్రలు పోషిస్తుంది. నటిగా తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. పుష్ప 2 తో పాటు రెండు మూడు తెలుగు సినిమాల్లో నటిస్తోంది. అలాగే తమిళ్ లో అనసూయ ఒక సినిమా చేస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: