హెచ్‌ఎండీఏ కమిషనర్ జనార్ధన్‌రెడ్డిపై బదిలీ వేటు!

Edari Rama Krishna

హైదరాబాద్ మెట్రో డెవలప్‌మెంట్ అథారటీ కమిషనర్ జనార్థన్‌రెడ్డిపై బదిలీ వేటు పడింది.  ఆయనను తప్పిస్తూ సోమవారం ఉదయం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.  ప్రస్తుతం ఆయన విదేశీ పర్యటనలో ఉన్నారు.  ఆయన విదేశీ పర్యటనలో ఉండగానే జనార్దన్ రెడ్డిని బదిలీ చేసినంది తెంలగాణ ప్రభుత్వం.


తాజాగా హెచ్‌ఎండీఏ కమిషనర్‌గా మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అరవింద్ కుమార్‌కు అదనపు బాధ్యతలు అప్పగించారు. ఇక  జనార్ధన్‌రెడ్డికి  ఎలాంటి పోస్టింగ్ ఇవ్వకుండా వెయిటింగ్‌లో పెట్టారు. విదేశాల నుంచి రాగానే సాధారణ పరిపాలన శాఖకు రిపోర్ట్ చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: