ఎన్నికల ముందు ఉండవల్లి సంచలన సమావేశం..!

KSK
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు వస్తున్న తరుణంలో రాజకీయ ముఖచిత్రం రోజుకో విధంగా మారిపోతుండటం అందరికి ఆశ్చర్యాన్ని మరియు ఆసక్తిని కనబరుస్తున్నాయి.


ఈ క్రమంలో త్వరలో రాష్ట్రంలో ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో చాలా ప్రధాన పార్టీలు ఆ పార్టీల నేతలు మరియు అధ్యక్షులు ప్రజల లోనే ఉంటూ అనేక హామీలు ఇస్తూ అధికారంలోకి వస్తే అది చేస్తాం ఇది చేస్తాం అన్నట్టుగా ప్రజలకు వాగ్దానాలు చేసే పనిలో పడ్డారు.


అయితే 2014 ఎన్నికల సమయంలో రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ అన్యాయంగా విభజించిన నేపథ్యంలో ఆ పార్టీకి రాజీనామా చేసిన రాజమహేంద్రవరం ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ గత కొంతకాలంగా క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉంటూ అడపాదడపా రాష్ట్రంలో మెజారిటీ సమస్యల గురించి మీడియా ముందు కనిపించడం తప్ప ఇంకా ఎక్కడ పెద్దగా కనబడటం లేదు.


ఈ నేపథ్యంలో ఉండవల్లి మీడియాతో మాట్లాడుతు ఈనెల 29న విజయవాడలో రాజకీయపార్టీలతో సమావేశం కానున్నట్లు తెలిపారు. ఏపికి జరిగిన అన్యాయంపై సమావేశంలో చర్చిస్తామన్నారు. ఈసమావేశానికి ఏడు రాజకీయ పార్టీలను ఆహ్వానించామని, అయితే వైఎస్‌ఆర్‌సిపి మాత్రం సమావేశానికి హాజరయ్యేందుకు అంగీకరించలేదని ఆయన తెలిపారు. సమావేశంలో ఉమ్మడి కార్యాచరణ రూపొందించనున్నట్లు ఉండవల్లి అరుణ్‌కుమార్ పేర్కొన్నారు..



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: