కొండ పై సామాన్యుడి లా మారిపోయిన జగన్ ..!

KSK
తాను తలపెట్టిన ప్రజా సంకల్ప పాదయాత్ర విజయవంతమవడంతో వైసీపీ పార్టీ అధినేత జగన్ తిరుమల తిరుపతి శ్రీవారిని కాలినడకన సామాన్యుడిలా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా చాలా మంది భక్తులు మరియు వైసీపీ పార్టీ కి మద్దతుగా ఉండేవారిలో వైయస్ సానుభూతిపరులు కొండపైకి జగన్ కాలినడకన వెళ్తున్న సమయంలో జై జగన్ జై జగన్ సీఎం సీఎం అంటూ నినాదాలు చేస్తూ తిరుపతి లో సందడి వాతావరణాన్ని సృష్టించారు.


మధ్యాహ్నం 1:40 నిమిషాలకు  అలిపిరి నుండి తిరుమలకు బయలుదేరారు. సాయంత్రం 4:40 గంటలకు జగన్ తిరుమల కొండపైకి చేరుకొన్నారు. తిరుమల కొండపై ఉన్న ఓ గెస్ట్‌హౌజ్‌లో కొద్దిసేపు విశ్రాంతి తీసుకొన్న తర్వాత సామాన్య భక్తుడి మాధిరిగానే వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ద్వారా శ్రీవారిని దర్శించుకొన్నారు. జగన్‌కు టీటీడీ అధికారులు స్వాగతం పలికారు.


ఈ క్రమంలో కొండపైన చాలామంది వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా జగన్ బాబు ముఖ్యమంత్రి అవుతారని. అతడు చేసిన కష్టం గాని ప్రజల కోసం చేసిన పోరాటాలు గాని వృధా కాదని ఏ అండలేని తన కుటుంబాన్ని కాచి కాపాడుకుంటూ మరోపక్క ప్రజల కోసం ఎక్కువగా జగన్ పోరాడటం ఈ రోజుల్లో ఇటువంటి రాజకీయ నేత ఇటువంటి ఖచ్చితమైన కమిట్మెంట్ కలిగిన నాయకుడు ఆంధ్ర రాష్ట్రంలో ఉండటం ఆంధ్ర ప్రజలు చేసుకున్న అదృష్టమని కొండపైన జగన్ చేస్తున్న పాదయాత్ర గురించి కథలు కథలుగా చెప్పుకుంటున్నారు.


కచ్చితంగా ఇతను ముఖ్యమంత్రి అయితే ఆంధ్ర రాష్ట్రంలో అభివృద్ధితో పాటు కొత్త చరిత్రకు నాంది పలుకుతుందని చాలా మంది సీనియర్ సిటిజన్లు అంటున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: