పోలవరం నిర్వాసితుల తో భేటీ అయిన పవన్ కళ్యాణ్..!

KSK
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పశ్చిమగోదావరి జిల్లా రెండవ వీడుత ప్రజాపోరాట యాత్ర అనేక సంచలనాలు సృష్టిస్తుంది ఏపీ రాజకీయాలలో. ముఖ్యంగా ఈ పర్యటనలో పవన్ చింతమనేని ఎపిసోడ్ ఏపీ రాష్ట్ర రాజకీయాలను కుదిపేసింది. ఇదే క్రమంలో పవన్ కళ్యాణ్ చంద్రబాబు పై చేసిన కామెంట్లు..అలాగే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కొంతమంది నాయకులు తనపై హత్యా ప్రయత్నం అంటూ చేసిన పవన్ కామెంట్లు ఏపీ రాజకీయాలను హీటెక్కించయి.


ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ పోలవరం ప్రాజెక్ట్ ముంపు గ్రామాల్లో పర్యటించారు. దీనికి ముందు జంగారెడ్డిగూడెం దగ్గరలో ఉన్న మధ్య ఆంజనేయస్వామి ఆలయాన్ని సందర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం తన యాత్రను మొదలు పెట్టిన పవన్ కళ్యాణ్..జంగారెడ్డిగూడెంలో డ్వాక్రా మహిళలతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా డ్వాక్రా మహిళలు 2014 ఎన్నికలలో అబద్ధాలు చెప్పి చంద్రబాబు మమ్మల్ని మోసం చేశారని పవన్ కళ్యాణ్ కి తమ బాధను వెళ్ళబుచ్చుతున్నారు.


ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ డ్వాక్రా మహిళలతో ముచ్చటిస్తూ రాబోయే ఎన్నికలలో చంద్రబాబు చెప్పే అబద్ధాలు నమ్మవద్దని డ్వాక్ర మహిళలకు తెలియజేశారు. అనంతరం పవన్ కళ్యాణ్ కుక్కునూరు లో పోలవరం ముంపు మండలాలలో పర్యటించారు. ఈ సందర్భంగా పోలవరం నిర్వాసితుల తో సమావేశమయ్యారు. పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ...‘నిర్వాసితుల పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబుది సవతి తల్లి ప్రేమ. నిర్వాసితులకు న్యాయం చేయకుండా 2019 నాటిని పోలవరం ప్రాజెక్ట్ ఎలా పూర్తి చేస్తారు.


పునరావాస బాధితులకు నాలుగు శాతం మాత్రమే పరిహారం. అగ్గిపెట్టెల్లాంటి ఇళ్లలో ఎలాం ఉంటారు. ఒక గదిరి రెండుగా నిర్మించారు. విద్యార్థులకు బస్సు సౌకర్యం లేదు. ముఖ్యమంత్రికి పోలవరం ప్రాజెక్ట్‌పై ఉన్న శ్రద్ధ నిర్వాసిత ప్రజలపై లేదు?’ అని ధ్వజమెత్తారు. అంతకు ముందు అశ్వారావుపేటలో పవన్‌కు అభిమానులు, స్థానికులు ఘన స్వాగతం పలికారు. ఇలా పవన్ కళ్యాణ్ పశ్చిమగోదావరి జిల్లా ప్రజల అభిమానాన్ని అందుకుంటూ మరోపక్క తన యాత్రను కొనసాగిస్తున్నారు.




మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: