మళ్ళీ రసకందం లో కర్ణాటక రాజకీయం... బీజేపీ మరో ఎత్తుగడ ఈ సారి ప్రభుత్వం పడి పోవక తప్పదా..!

Prathap Kaluva

కర్ణాటక లో హంగ్ ఏర్పడినప్పడూ ఈ రాష్ట్ర రాజకీయాలు ఎన్ని మలుపులు తిరిగినాయో మనకందరికీ తెలిసిందే. బీజేపీ కుటీలా రాజకీయాలకు పాల్పడింది దానితో బీజెపీ మీద విమర్శలు చెలరేగినాయి. అయితే మరలా ఇప్పడూ బీజేపీ కాంగ్రెస్-జేడీఎస్ ప్రభుత్వాన్ని పడగొట్టాలని ప్లాన్ చేస్తున్నట్టు కర్ణాటక పత్రిక ప్రచురించింది. కుమారస్వామికి వ్యతిరేకంగా కుట్రకు రంగం సిద్ధం అయ్యిందని.. మాజీ సీఎం సిద్దరామయ్య ఆధ్వర్యంలో ఈ తిరుగుబాటు జరగవచ్చని ఆ పత్రిక పేర్కొంది.


సిద్దూకు భారతీయ జనతాపార్టీ అండగా నిలవనుందని, ఆయనకు బంపర్ ఆఫర్ ఇచ్చి చేర్చుకునేందుకు బీజేపీ ప్లాన్ సిద్ధం చేసిందని సమాచారం. సిద్దరామయ్య తనతో పాటు కాంగ్రెస్ పార్టీలోని అసహన నేతలందరితోనూ రాజీనామా చేయించే ప్రయత్నం చేయనున్నారని సమాచారం. వీరంతా కలిసి రాజీనామాలు చేస్తే ప్రభుత్వం ఆటోమెటిక్‌గా మైనారిటీలో పడిపోతుంది. ఆ తర్వాత బీజేపీ కథను నడిపించగలదు.


ఇలా బయటకు వస్తే సిద్ధరామయ్యకు భారీ ఆఫర్ ఇస్తామని కూడా బీజేపీ హామీ ఇచ్చిందని సమాచారం. ఇప్పటికప్పుడు కాకపోయినా భవిష్యత్తులో మంచి అవకాశాలుంటాయని.. ఉప రాష్ట్రపతిని చేస్తామని సిద్దూకు హామీ ఇచ్చిందట బీజేపీ అధిష్టానం. తాత్కాలికంగా కొన్ని ప్రయోజనాలను కలిగించి, దీర్ఘకాలంలో ఉప రాష్ట్రపతి పదవిని ఎరగావేసి.. బీజేపీ కర్ణాటకలో కొత్త రాజకీయ రచ్చకు తెరలేపనుందని బెంగళూరు మిర్రర్ వివరించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: