టీడీపీ లో జేసి పరిస్థితి ఏంటి... జగన్ కూడా 'నో' అన్నాడా..!

Prathap Kaluva

టీడీపీ అనంత పురం ఎంపీ జేసి గురించి అందరికీ తెలిసే ఉంటుంది. నోటికొచ్చింది ఉన్నది ఉన్నట్టు మాట్లాడుతాడు దీనితో స్వంత పార్టీలోనే ఇతనంటే కొంత మందికి గిట్టదు. పైగా అనంత పురం లోని అందరీ ఎమ్మెల్యేలతో గొడవలు ఉన్నాయి. దీనితో 2019 ఎన్నికల్లో ఇతని విజయం మీద నమ్మకం కుదరడం లేదు. వచ్చే ఎన్నికలలో తనయుడు జేసీ పవన్‌ను పోటీ చేయించాలని దివాకర్‌ రెడ్డి ప్రయత్నాలు చేస్తున్నాడు. పోటీకి అయితే చంద్రబాబు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. బాబుకు కూడా ఇప్పుడు అనంతపురం ఎంపీ టికెట్‌కు తగిన క్యాండిడేట్‌ లేడు. ఏడు నియోజకవర్గాల్లో వైసీపీతో పోటీపడి, భారీగా ఖర్చులు పెట్టుకుని, జనామోదం పొందే నేత ప్రస్తుతానికి కూడా అనంతపురం టీడీపీలో లేడు. అందుకే జేసీ పవన్‌కు బాబు తలూపే అవకాశాలున్నాయి.


ఇలా జేసీ పవన్‌ తెలుగుదేశం పార్టీ తరఫున టికెట్‌ సంపాదించుకోవడం పెద్ద కష్టంకాదు కానీ, పోటీచేసి నెగ్గుకురావడమే అంత ఈజీ వ్యవహారం కాదు. పవన్‌ ముందు చాలా ఛాలెంజ్‌లున్నాయి. అందులో ముఖ్యమైనది తెలుగుదేశం పార్టీ అంతర్గత పోరు. గత ఎన్నికల సమయంలో దివాకర్‌ రెడ్డి తెలుగుదేశంలోకి చేరి అందరినీ కలుపుకుపోయాడు కానీ ఆ తర్వాత జేసీకి అందరితోనూ తగవులే! ఒకరితో కాదు.. అందరితోనూ. పార్టీలో ఉన్న వాళ్లందరితోనూ తగవులే ఉన్నాయి దివాకర్‌ రెడ్డికి. అందుకే ఇప్పుడు పార్టీ బయటి వారిని తెచ్చి వచ్చేసారి పోటీ చేయించాలని చూస్తున్నాడు.


దివాకర్‌ రెడ్డి తెలుగుదేశం పార్టీలో ఇమడలేకపోతున్న వైనం ఇప్పటిది ఏమీకాదు. ఈయన వైసీపీలోకి చేరే విషయమై గతంలోనే చర్చలు జరిగాయనేది జిల్లాలో వినిపించే మాట. మొత్తం ఐదు టికెట్లకు బేరంపెట్టి జేసీ వైసీపీలోకి చేరే ప్రయత్నానికి జగన్‌ సానుకూలంగా స్పందించలేదు. దీంతో అప్పటి నుంచి జగన్‌పై అక్కసు వెల్లగక్కుతున్నాడు జేసీ. జేసీ పొకడ ఏమాత్రం గిట్టనివాళ్లే ఇప్పుడు అనంత వైసీపీలో యాక్టివ్‌గా ఉన్నారు. జగన్‌ కూడా ఇప్పుడు జేసీని నమ్ముకోదలచుకోలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: