పవన్ కళ్యాణ్ కనీసం చిరంజీవి మార్కు ను దాటగలడా...!

Prathap Kaluva
2019 ఎన్నికల్లో త్రిముఖ పోరు జరగనున్నది. అయితే పేరుకు త్రిముఖ పోరు అయినప్పటికీ ప్రధాన పోటీ టీడీపీ మరియు వైసీపీ మధ్య నున్నది. ఇది అందరూ ఒప్పుకొని తీరాల్సిందే. అయితే పవన్ కళ్యాణ్ ప్రభావం ఎంత ఉంటుంది అన్నది ప్రస్థుతానికి సస్పెన్సే. అయితే 2014 లో చిరంజీవి పార్టీ పెట్టినపుడు ఆ పార్టీ పట్టుమని 20 సీట్లు కూడా గెలవలేదు. ఒక ఇంకా ఒక ఎంపీ సీటు కూడా గెలవలేకపోయింది. 

చిరంజీవి లాగానే పవన్‌కళ్యాణ్‌ కూడా, అభిమానులే ఓటర్లు.. ఆ అభిమానులకు తోడు ఇతరత్రా అంశాలు కలిసొస్తే, అధికార పీఠమెక్కొచ్చనే ఆలోచనతోనే వున్నారు. అయితే, రాజకీయాల్లోకి వచ్చిన చిరంజీవికి పెద్దగా సమయం లేకపోయింది. వున్న సమయాన్నే ఆయన వీలైనంత ఎక్కువగా వినియోగించుకున్నారన్నది కాదనలేని వాస్తవం. పార్టీ నిర్మాణం దగ్గర్నుంచి, ప్రతి విషంలోనూ ప్రస్తుత జనసేనతో పోల్చితే, ఒకప్పటి ప్రజారాజ్యమే చాలా బెటర్‌.


పార్టీ ప్రారంభమయి నాలుగేళ్ళు పూర్తయినా ఇంతవరకు జనసేనకి సంబంధించి పూర్తిస్థాయి నిర్మాణమే జరగలేదాయె. మరి, 2019 ఎన్నికలకు జనసేన ఎలా సన్నద్ధమవుతుంది.? అన్న ప్రశ్నకు పవన్‌కళ్యాణ్‌ దగ్గరే సమాధానంలేదు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఖచ్చితంగా ప్రతిపక్షానికే వెళుతుంది. దాంట్లో ఎంతోకొంత షేర్‌ పవన్‌కళ్యాణ్‌ తీసుకోగలగుతారేమో. మరి, అభిమానుల మాటేమిటి.? మెగా అభిమానుల్ని పవన్‌ ఇటీవలే అక్కున చేర్చుకునేందుకు ప్రయత్నించారు. మరి, 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్‌లో జనసేన 'స్కోర్‌' ఎంత.? 20 ప్లస్‌ సాధిస్తే మాత్రం, జనసేన ఎంతోకొంత సక్సెస్‌ అయినట్లే. కాదు, అధికారం దక్కించుకుంటామని జనసేన పార్టీ చెబుతున్న మాటలు నిజమవుతాయా.? వేచి చూడాల్సిందే.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: