పవన్: అభిమానులకు నిద్రలేకుండా చేస్తున్నారా..?

Divya
ఆంధ్రప్రదేశ్ ఎన్నికలలోని గత కొద్దిరోజులుగా పిఠాపురం నియోజవర్గం గురించి పలు రకాల వార్తలు వినిపిస్తున్నాయి.. కేవలం అక్కడ పవన్ కళ్యాణ్ వైసిపి అభ్యర్థి గీత పైన పోటీ చేస్తూ ఉండడంతో పవన్ కళ్యాణ్ ని ఎలాగైనా గెలిపించాలని ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు.. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పోరాటం ఒకఎత్తు అయితే.. మొత్తం తెలుగు సినిమా ఇండస్ట్రీ పవన్ కళ్యాణ్ సక్సెస్ కోసం పోరాడుతూనే ఉంది. ఇప్పటికే జబర్దస్త్ కమెడియన్ తో పాటు బుల్లితెర నటీమణులు వరుణ్ తేజ్ వంటి వారు కూడా ప్రచారం చేస్తూ ఉన్నారు.

కార్యకర్తలు కూడా రాత్రి పగలు కష్టపడుతూనే ఉన్నారు. అయితే ఇలాంటి సమయంలో ఒక చల్లని న్యూస్ వినిపిస్తోంది.. అదేమిటంటే హరిహర వీరమల్లు సినిమాకు సంబంధించిన విషయం... గడిచిన రెండు రోజుల క్రితం టీజర్ ని కూడా విడుదల చేశారు. బాహుబలి సినిమా అలాంటి క్రేజ్ తో ఈ సినిమా రాబోతోంది. అలాంటి క్రేజ్ తోనే ఇది పాన్ ఇండియా సినిమా కాబట్టి వివిధ భాషలలో రాబోతోంది. ఈ టీజర్ చూసిన అభిమానులు ఒక్కసారిగా పెంచేస్తున్నారు.

ముఖ్యంగా రాజులను దోచుకొని ఒక దొంగగా ఇందులో పవన్ కళ్యాణ్ కనిపించబోతున్నట్లు సమాచారం. ముఖ్యంగా ఇందులోని సన్నివేశాలు కూడా అభిమానులకు గూస్ బంప్స్ తెప్పించేలా కనిపిస్తున్నాయి.. రెండు కత్తులతో చేసినటువంటి ఫైట్ సీను కూడా అద్భుతంగా ఆకట్టుకుంటోంది. పవన్ కళ్యాణ్ మేకవర్ స్టైల్ కూడా ఇందులో చాలా ఆకట్టుకునేలా కనిపిస్తోంది. ఈ టీజర్ చూసిన తర్వాత చాలామంది పవన్ ఫ్యాన్స్ కు నిద్ర పట్టనివ్వలేదట.. అయితే ఈ ఏడాది ఈ సినిమాని విడుదల చేసే విధంగా ప్లాన్ చేస్తున్నారు చిత్ర బృందం. నిర్మాత ఏం రత్నం కూడా ఈ చిత్రానికి భారీ బడ్జెట్ తోనే తెరకెక్కిస్తూ ఉన్నారు. మొట్టమొదటి పవన్ కళ్యాణ్ పాన్ ఇండియా  సినిమా ఇదే కావడంతో  మరింత హైప్స్ నెలకొన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: