ధోని ఇలా చేశాడంటే.. 'తలా'పై విమర్శలు?

praveen
ప్రస్తుతం 2024 ఐపిఎల్ సీజన్ ఎంతో రసవత్తరంగా సాగుతుంది. ఇక ప్రేక్షకులు అందరూ కూడా ఒక్క మ్యాచ్ కూడా మిస్ అవ్వకుండా అన్ని మ్యాచ్ లను  వీక్షిస్తూ ఉన్నారు అన్న విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం దాదాపుగా అన్ని జట్లు కూడా 10 మ్యాచ్ లను పూర్తి చేసుకున్నాయి. ఈ క్రమంలోనే ఇక ఇప్పుడు ప్లే ఆఫ్ రేస్ లో నిలిచేందుకు అన్ని టీమ్స్ కూడా కష్టపడి పోతున్నాయి అని చెప్పాలి. ఇక ముంబై, బెంగళూరు టీమ్స్ ఇప్పటికే ప్లేయర్ రేస్ నుంచి నిష్క్రమించాయి అన్న విషయం అర్థం అవుతుంది. ఇక ఈ సీజన్లో చెన్నై కూడా  పరవాలేదు అనే విధంగానే ప్రదర్శన చేస్తుంది.

 అటు కొత్త కెప్టెన్ రుతురాజు గైక్వాడ్ సారధ్యంలో బరిలోకి దిగి ఇక మంచి ప్రదర్శన చేస్తుంది. ఇప్పటివరకు పది మ్యాచ్ లు ఆడిన చెన్నై సూపర్ కింగ్స్ ఏకంగా ఐదు విజయాలు సాధించింది అని చెప్పాలి. అయితే ఇలా చెన్నై మంచి ప్రదర్శన చేయడం ఒక ఎత్తు అయితే.. ఇక ధోని ఈ సీజన్లో మెరుపు బ్యాటింగ్తో ఆకట్టుకోవడం మరో ఎత్తు. ధోనికి ఇది చివరి ఐపీఎల్ సీజన్ అని అభిమానులందరూ కూడా ఫిక్స్ అయిన సమయంలో.. ధోని చివర్లో బ్యాటింగ్ కి వచ్చి సిక్సర్లు ఫోర్లతో చెలరేగిపోతున్నాడు. అదిరిపోయే ప్రదర్శన చేస్తూ ఆకట్టుకుంటున్నాడు. ఇక ధోని బ్యాటింగ్ పై అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు అని చెప్పాలి.

 అయితే ఇటీవల చేసిన పనికి  ధోని తీరుపై విమర్శలు వస్తున్నాయి. ఇటీవల పంజాబీ కింగ్స్ తో జరిగిన మ్యాచ్లో చివర్లో బ్యాటింగ్ కి వచ్చాడు ధోని.  ఆఖరి ఓవర్ లో ఫుల్ టాక్స్ బంతిని ధోని గాల్లోకి ఆడాడు. దీంతో నాన్ స్ట్రైకర్ లో ఉన్న మిచెల్ రన్ కోసం పరిగెత్తుకొచ్చాడు. కానీ ధోని మాత్రం క్రీజు వదలలేదు. అయితే ఈ విషయంపై విమర్శలు వస్తున్నాయి. నాన్ స్ట్రైకర్ గా బ్యాటింగ్ రాని వాళ్ళు ఉంటే ధోని ఇలా చేసి ఉంటే బాగుండేది. కానీ అక్కడ ఉంది మిచెల్ లాంటి పవర్ హిట్టర్. అలాంటప్పుడు ఒక సింగిల్ తీసి అతనికి స్ట్రైక్ ఇవ్వకుండా ధోని ఇలా చేయడం ఏంటి అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే ఇలా పరుగు కోసం వచ్చిన మిచెల్ ఏకంగా ధోని వరకు వెళ్లి మళ్లీ వెనక్కి తిరిగి వచ్చాడు అని చెప్పాలీ. అయితే అభిమానులను తన బ్యాటింగ్ తో అలరించడానికి ధోని ఇలా చేశాడు అంటూ అభిమానులు మహేంద్రుడికి మద్దతుగా నిలుస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: