పాపం ఆ క్రికెటర్.. నానీ జెర్సీ సీన్ రిపీట్?

praveen
కొన్ని కొన్ని సార్లు సినిమాల్లో కనిపించే సీన్స్ నిజ జీవితంలో కూడా నిజం అవుతూ ఉంటాయి అన్న విషయం తెలిసిందే. ఇలా రియల్ లైఫ్ లో వెలుగులోకి వచ్చిన ఘటనలు గురించి తెలిసినప్పుడు అరెరే సినిమాలో కూడా అచ్చం ఇలాగే జరిగింది కదా అని అందరికీ అనిపిస్తూ ఉంటుంది. ఇక ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది కూడా ఇలాంటి తరహా ఘటన గురించే. నాని హీరోగా నటించిన జెర్సీ సినిమా గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం అక్కర్లేదు. క్రికెట్ నేపద్యంలో వచ్చిన ఈ మూవీ ఎంతటి బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

 ఈ మూవీలో నాని పాత్ర క్రికెట్  ప్రాణంగా బ్రతుకుతుంది. అలాంటి క్రికెట్ ను ఎందుకు వదిలేసాడు అన్న విషయాన్ని కూడా ఇక మూవీ మధ్యలో చూపిస్తారు. ఏకంగా నానికి హార్ట్ ప్రాబ్లం ఉన్న కారణంగా క్రికెట్లో కొనసాగితే ఏ క్షణంలోనైనా గుండె ఆగిపోయే ప్రమాదం ఉందని వైద్యులు సూచిస్తారు. దీంతో తన కుటుంబం కోసం ఏకంగా తనకు ఇష్టమైన క్రికెట్ నే వదులుకుంటాడు నాని. కానీ ఆ తర్వాత క్రికెట్ ఎందుకు వదులుకున్నాను అని బాధపడుతూ ఉంటాడు. అయితే అచ్చం నాని జెర్సీ సినిమాలో లాగానే ఇప్పుడు రియల్ లైఫ్ క్రికెట్ లో కూడా ఒక ఆటగాడు విషయంలో ఇలాంటిదే జరిగింది.

 ఏకంగా ఒక ఆటగాడు 23 ఏళ్లకే తన క్రికెట్ కెరీర్ కు రిటైర్మెంట్ ప్రకటించారు. ఇంగ్లాండ్ కౌంటర్ క్రికెటర్ బెన్ వెల్స్ ఇలా చిన్న వయసులోనే వీడ్కోలు పలికాడు అని చెప్పాలి. అతను హార్థమిక్ రైట్ వెంక్యూలేటర్ కార్డియో మయోపతి అనే వ్యాధితో బాధపడుతున్నాడు. ఇక ఈ వ్యాధితో ఉన్నవారు పరిగెత్తడం కారణంగా ఊపిరి తీసుకోవడం కష్టంగా మారి గుండె ఆగిపోయే ప్రమాదం కూడా ఉంటుందట. అంతేకాదు ఇక వ్యాయామానికి కూడా దూరంగా ఉండాలట. కాదు కూడదు అని క్రికెట్ ఆడితే ఏకంగా ప్రాణాలకే ప్రమాదం వాటిల్లే అవకాశం అనేది వైద్యులు కూడా హెచ్చరించారట. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఇష్టం లేకపోయినా ఆటకు వీడ్కోలు పలికాడు బెన్ వెల్స్. కాగా సదురు ప్లేయర్ ఇంగ్లాండ్ తరఫున 9 t20 మ్యాచ్ లు, ఓ ఫస్ట్ క్లాస్ మ్యాచ్, 15 లిస్ట్ ఏ మ్యాచ్ లు ఆడాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: