వెంకటేష్ వల్లే సినిమాలకు దూరం.. సింగర్ కామెంట్స్ వైరల్.!

Pandrala Sravanthi
ఏంటి విక్టరీ వెంకటేష్ సినిమా వల్లే ఆ సింగర్ సినిమాలకు దూరమైందా..ఇది నిజమేనా.. ఇంతకీ సింగర్ చెప్పిన రీజన్ ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. సింగర్ స్మిత అంటే తెలియని వారు ఉండరు. నటిగా.. సింగర్ గా.. ఎంతో మంచి గుర్తింపు సంపాదించిన స్మిత కేవలం సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానే కాకుండా ఎన్నో ప్రైవేట్ ఆల్బమ్స్ చేస్తూ తనకంటూ ఓ ప్రత్యేకమైన ఇమేజ్ సంపాదించుకుంది. అయితే అలాంటి స్మిత ఒకప్పటి పాత పాటలు మళ్లీ కొత్త వెర్షన్ లో తీసుకువస్తూ మంచి రెస్పాన్స్ అందుకుంటుంది. అలా తాజాగా మసక మసక చీకట్లో అనే పాట రిమీక్స్ చేసి మళ్లీ మన ముందుకు కొత్త వెర్షన్ లో తీసుకువచ్చింది.


అయితే ఈ పాటకి అద్భుతమైన రెస్పాన్స్ రావడంతో ఈ పాటను మరో వర్షన్ లో విడుదల చేసింది. అలా తాజాగా శనివారం రోజు ఈవెంట్ లో ఈ పాటను విడుదల చేసింది. ఇక ఆ ఈవెంట్ కి కొంతమంది విలేఖరులు వచ్చి పాట గురించి ఆమె కెరియర్ గురించి ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలు అడిగి తెలుసుకున్నారు. అలా ఓ రిపోర్టర్ ఎందుకు మీరు సినిమాలు మానేయాల్సి వచ్చింది అని ప్రశ్నించగా.. నేను సినిమాలు మానేయడానికి ఏకైక కారణం వెంకటేష్ హీరోగా వచ్చిన మల్లీశ్వరి మూవీనే..ఎందుకంటే ఈ సినిమా చేసే సమయంలో ముందు స్టోరీ ఒకలా చెప్పారు. ఆ తర్వాత ఒకలా చూపించారు.


అందుకే ఇక సినిమాలు చేయకూడదని ఫిక్స్ అయ్యాను. ఆ సినిమా విషయంలో మిస్ ఫైర్ అయింది. అందుకే సినిమాలపై ఇంట్రెస్ట్ లేదు అంటూ సింగర్ స్మిత చెప్పుకొచ్చింది.అయితే మల్లీశ్వరి మూవీలో స్మిత ఓ నెగటివ్ పాత్రలో నటించింది. అలా పనిమనిషి పాత్రలో కనిపించినప్పటికీ ఈమె కనిపించే సీన్స్ కేవలం రెండు మూడు మాత్రమే. అలా స్టోరీ చెప్పినప్పుడు బలమైన పాత్ర అని చెప్పి తర్వాత స్క్రీన్ మీద మాత్రం తక్కువగా చూపించడంతో స్మితకి సినిమాల మీద ఇంట్రెస్ట్ పోయిందట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: