వైసీపీ: ఎన్నికలవేళ భారీ షాక్.. పార్టీ వీడిన కీలక నేత..!

Divya
ఎన్నికల సమీపిస్తున్న వేళ అధికార పార్టీ వైసీపీకి బిక్ షాక్ తగిలినట్టుగా తెలుస్తోంది.. అసలు విషయంలోకి వెళ్తే పల్నాడు జిల్లాలో అమరావతి ఎంపీపీ మేకల హనుమంతురావు యాదవ్ ఇటీవల వైసీపీ పార్టీకి రాజీనామా చేసినట్టుగా తెలుస్తోంది.. ఈయన వైసీపీ రాష్ట్ర పంచాయతీరాజ్ విభాగంలోని ప్రెసిడెంట్ పదవికి కూడా రాజీనామా చేసినట్లుగా సమాచారం.. తన అనుచరులు అందరితో కలిసి వైసిపికి గుడ్ బై చెప్పినట్లుగా తెలుస్తోంది. అయితే అక్కడ పార్టీ పెద్దల తీరుతో తాను చాలా విసిగిపోయానని అందుకే ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్లు తెలియజేశారు.

ముఖ్యంగా పెదకూరపాడు ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు వైఖరితో విసిగిపోయినటువంటి ఈయన ఏడాది కాలం పాటు తనను వేధింపులకు గురి చేశారంటూ కూడా హనుమంతరావు యాదవ్ వెల్లడించారు.. ముఖ్యంగా అక్కడ బీసీ నేతలను ఎదుగుదల చూసి ఆయన ఓర్వలేక పోతున్నారంటూ కూడా తెలియజేశారు. ఇక్కడ వైసిపి ఎంపీ అభ్యర్థిగా అనిల్ కుమార్ యాదవ్ వచ్చినా కూడా కొత్తగా జరిగేది ఏమీ లేదంటూ తెలియజేశారు. పార్టీ పెద్దలకు సమాచారం అందించిన కూడా ఈ విషయం పైన ఎవరూ పట్టించుకోలేదంటూ హనుమంతరావు వెల్లడించారు

ఇలా వైసీపీ పార్టీలో తనకు అన్ని అవమానాలు జరుగుతున్న సమయంలో వాటన్నిటిని భరించలేకనే వైసీపీ పార్టీకి తన అనుచరులతో సహా రాజీనామా చేస్తున్నామంటూ హనుమంతరావు వెల్లడించారు. మరో 10 రోజులలో ఎలక్షన్ జరగబోతున్న సమయంలో ఇలా వైసీపీని వెళుతూ ఉండడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. మరి ఈ విషయం పైన వైసిపి పార్టీ ఎలా స్పందిస్తుందో చూడాలి మరి. అయితే ఈసారి అధికార పార్టీ వైసీపీ నే వస్తుందంటూ చాలా ధీమాని వ్యక్తం చేస్తున్న సమయంలో టిడిపి పార్టీ కూడా అంతే దీమాని వ్యక్తం చేస్తున్నారు. అటు జగన్ ఇటు పవన్ చంద్రబాబు ఇద్దరు కూడా ప్రచారంలో శరవేగంగా ముందుకు వెళుతున్నారు. మరి ఈసారి ఫలితాలు ఎలా ఉంటాయో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: