పవన్: పొలిటికల్ కెరియర్ ఎటువైపు.. సీఎం అవ్వలేరా..?

Divya
సినీ కెరియర్ పీక్స్ లో ఉన్న సమయం లో పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని పెట్టి పొలిటికల్ పరంగా ఎంట్రీ ఇచ్చారు.. కేవలం జనాలకు సేవ చేయాలని ఉద్దేశంతోనే పవన్ కళ్యాణ్ పొలిటికల్ వైపుగా అడుగులు వేశారు.. ప్రజలకు కష్టం వస్తే క్షణాలలో వాలుతానాన్ని పార్టీ పెట్టినప్పుడే తెలియజేశారు.అలాగే ప్రభుత్వం పైన పోరాటం కూడా చేస్తూ ఉంటానని తెలియజేశారు. పవన్ కళ్యాణ్ పార్టీ స్థాపించేటప్పుడే ఒక నిర్దిష్టమైన లక్ష్యాన్ని పెట్టుకున్నారు. ఎప్పటికైనా తను అధికారంలోకి వచ్చి జనానికి మంచి చేయాలని ఉద్దేశంతోనే పెట్టానని తెలిపారు.

అలా 2019 వ సంవత్సరంలో పవన్ కళ్యాణ్ రెండు చోట్ల పోటీ చేయగా ఓడిపోయారు. అయితే అలా ఓడిపోయినప్పటికీ ఎక్కడ కూడా విశ్వాసాన్ని కోల్పోలేదు. ఎప్పటికప్పుడు పోరాటం చేస్తూ ఉన్నారు. ఇలాంటి సమయంలోనే తన పార్టీని కాపాడుకుంటూ అపోజిషన్ పార్టీలో ఉంటూ పోరాటం చేస్తూ ఉన్నారు పవన్ కళ్యాణ్. ఈసారి బిజెపి, తెలుగుదేశం, జనసేన పార్టీ కూటమితో కలిసి ఆంధ్రాలో పోటీ చేస్తున్నాయి.. అయితే ఇదంతా చూస్తూ ఉంటే పవన్ కళ్యాణ్ ఎందుకు పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారని అభిమానుల సైతం వాపోతున్నారు.

టిడిపి పార్టీకి ఎక్కువగా సపోర్టు చేస్తూ ఉండడంతో అభిమానులు నేతలు కూడా పవన్ కళ్యాణ్ ని విమర్శిస్తూ ఉంటారు.. ఎప్పటికైనా అభిమానులు తనని సీఎంగా చూడాలని కోరుకుంటూంటున్నారు. ప్రతిసారి పవన్ కళ్యాణ్ చంద్రబాబును సీఎం చేయడానికి పోరాడుతున్నారు తప్ప తన సొంతంగా ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేకపోతున్నారు. దీంతో చాలామంది ఒక మంత్రి పదవి పొందడానికి పవన్ కళ్యాణ్ ఇంతలా పోరాటం చేయవలసి ఉందా అంటూ ఎద్దేవ చేస్తున్నారు. ప్రజలకు సేవ చేయాలంటే కేవలం పార్టీ పెట్టాల్సిన పనిలేదు.. ఎవరికైనా మద్దతు తెలిపితే చాలు కచ్చితంగా మంత్రి పదవి ఇస్తారంటూ నెగిటివ్ గానే ప్రచారం జరుగుతోంది. అసలు పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టినప్పుడు ఏం చెప్పారు ఇప్పుడు చేస్తున్నది కరెక్టేనా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: