ఆలోచించు: విదేశాల్లో నాయకులు.. విద్వేషాల్లో కార్యకర్తలు..!

Pandrala Sravanthi
ఏ పార్టీని చూసిన ఏమున్నది గర్వ కారణం  అంతా కొట్లాటలు, కుమ్ములాటలు, విద్వేషాలతో కూడిన  రాజకీయం. అలాంటి ఈ పాలిటిక్స్ లో  కేవలం బలయ్యేది సామాన్య కార్యకర్తలు మాత్రమే. జెండా మోసినా, ప్రచారం చేసినా ఓటర్ల దగ్గరికి వెళ్లి మోటివేట్ చేసినా, నాయకుడు ఒక్క అడుగు ముందుకు వేయాలన్న, ముందు నడిచేది మాత్రం కార్యకర్త. ఇలా రాజకీయ పార్టీలు ఆవిర్భవించినప్పటి నుంచి కార్యకర్తలు అనేవారు ఉన్నారు. కార్యకర్తలే పార్టీకి ప్రధాన పిల్లర్లు. కానీ ఏ పార్టీలో చూసినా కార్యకర్తలు కష్టపడి పని చేసుకుని వారి కుటుంబాన్ని సాకుకోవడమే తప్ప పార్టీల్లో తిరిగితే వచ్చిందేమీ లేదు.  ఎంతో కష్టపడి నాయకుడిని గెలిపిస్తే మాత్రం ఆయన కార్లు, బంగ్లాలు, భూములు,  ఆస్తుల మీద ఆస్తులు సంపాదించుకుంటున్నారు. 

కార్యకర్త కుటుంబీకుల  పిల్లలు సాదాసీదాగా బతికితే,  ఆ నాయకుల పిల్లలు విదేశాల్లో విలాసాలు అనుభవిస్తారు. అలాంటి ఈ రాజకీయ కీచులాటలో  మీరెందుకు బలి కావాలి. మీ ప్రాణాలు ఎందుకు పోగొట్టుకోవాలి. నీకంటూ ఆత్మగౌరవం లేదా, నాయకుడు అణువు కానప్పుడు  పార్టీ మారతాడు, కానీ కార్యకర్త అక్కడ బంధీ అయిపోతాడు. ప్రస్తుతం ఏపీ రాష్ట్రంలో 175 అసెంబ్లీ నియోజకవర్గాలు, 25 పార్లమెంటు స్థానాల్లో  ఎన్నికలు ముగిసాయి. దాదాపు ఆరు నెలల ముందు నుంచి ఎన్నికల మూమెంట్ అనేది స్టార్ట్ అయింది.  అప్పటినుంచి ఏ నాయకుడైనా సరే, ముందుగా  కార్యకర్తల మీటింగులు పెట్టి మీకోసం మేమున్నాం, మీరు ముందు నడిచి మమ్మల్ని గెలిపించండి అంటూ చెప్పారు.

 కార్యకర్తలు, కింది స్థాయి లీడర్లు ముందు నడిస్తేనే  ఈ బడా నాయకులు వచ్చారు. ఎన్నికల ముగిసాయి , జూన్ 4న రిజల్ట్ రాబోతున్నాయి.  ఇన్ని నెలలు ప్రచారంలో ఉన్నటువంటి నాయకులు ఎంజాయ్ చేయడం కోసం ఇతర దేశాలకు వెళ్తున్నారు. లోకల్ లో ఉన్నటువంటి కార్యకర్తలు, కిందిస్థాయి నాయకులు ఏమో  రెండు పార్టీలుగా ఏర్పడి తెగ కొట్టుకుంటున్నారు. వైసిపి నాయకులు  టిడిపి కార్యకర్తలను టార్గెట్ చేస్తే, టిడిపి నాయకులేమో వైసీపీ కార్యకర్తలను టార్గెట్ చేస్తున్నారు. ఒకరికొకరు రక్తలు కారేలా కొట్టుకుంటున్నారు. చివరికి జైలు పాలుఅవుతున్నారు. కానీ నాయకులేమో  వారి అవసరాలకు తగ్గట్టు  ఏ పార్టీలో బ్రతుకుదెరువుంటే ఆ పార్టీలోకి వెళ్ళిపోతున్నారు.

వారు ఏ పార్టీలోకి వెళ్లినా   అక్కడ బలయ్యేది మాత్రం కార్యకర్త.  జెండా మోసేది, నాయకుడిని గెలిపించేది, చివరికి పార్టీలను పట్టుకొని నాశనం అయ్యేది మాత్రం కార్యకర్త. కానీ ఒక్క కార్యకర్త బంగ్లాలు కట్టి, వారి పిల్లలను  విదేశాలకు పంపి చదివించింది లేదు. ఈ విధంగా కనీస ఇంగిత జ్ఞానం లేకుండా ఒకరికొకరు కొట్టుకోవడం ఎందుకు.. ఓకే ఊర్లో ఉంటూ  రెండు పార్టీల వైపున ఉన్నటువంటి కార్యకర్తలు ఒకరినొకరు కొట్టుకొని,  బంగారు భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారు.  కానీ పార్టీ స్థాపించిన నాయకులు,  ఎన్నికలు ముగియగానే  విదేశాలకు వెళ్లి వారి కుటుంబాలతో ఎంజాయ్ చేస్తున్నారు. కింది స్థాయి నాయకుల్లో మాత్రం విద్వేషాలు రెచ్చగొడుతున్నారు. వారు విదేశాల్లో ఎంజాయ్ చేస్తున్నారు.  ఇప్పటికైనా ఆలోచించి నీ బ్రతుకేందో నువ్వు చూసుకున్న తర్వాత,  పార్టీ గురించి ఆలోచించు అని రాజకీయ విశ్లేషకులు, నిపుణులు హెచ్చరిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: