సుమంత్ బ్లాక్ బస్టర్ మూవీకి నేటితో 18 ఏళ్లు..!

Pulgam Srinivas
తెలుగు సినీ పరిశ్రమలో అద్భుతమైన గుర్తింపు కలిగిన దర్శకులలో ఒకరు అయినటువంటి శేఖర్ కమ్ముల ఇప్పటివరకు తన కెరీర్ లో ఎన్నో అద్భుతమైన సినిమాలకు దర్శకత్వం వహించాడు. ఈయన దర్శకత్వం వహించిన గొప్ప సినిమాలలో గోదావరి మూవీ ఒకటి. ఈ సినిమాలో సుమంత్ హీరో గా నటించగా ... కమలిని ముఖర్జీ ఈ మూవీ లో హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ కంటే ముందు శేఖర్ కమ్ముల "ఆనంద్" అనే సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో కూడా కమలిని ముఖర్జీ హీరోయిన్ గా నటించింది. కమిలిని ముఖర్జీ తన మొత్తం కెరియర్ లో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందిన ఆనంద్ , గోదావరి ఈ రెండు సినిమాల తోనే అద్భుతమైన విజయాలను అందుకుంది.
 

అలాగే గొప్ప గుర్తింపును కూడా సంపాదించుకుంది. ఆ తర్వాత అనేక సినిమాలలో ఈమె నటించినప్పటికీ ఈ రెండు మూవీ ల ద్వారా వచ్చిన గుర్తింపు ఈమెకు ఆ తర్వాతే ఏ సినిమాల ద్వారా కూడా లభించలేదు. ఇక గోదావరి సినిమా విషయానికి వస్తే ... సుమంత్ కెరియర్ లో కూడా ఈ మూవీ అద్భుతమైన విజయవంతమైన సినిమాగా నిలిచింది. రాధాకృష్ణ ఈ మూవీ కి సంగీతం అందించగా ... జి బి జి రాజు ఈ మూవీ ని నిర్మించాడు. ఇకపోతే ఈ సినిమా మామూలు అంచనాల నడుమ 2006 వ సంవత్సరం మే 19 వ తేదీన థియేటర్ లలో విడుదల అయింది.

మామూలు అంచనాల నడుమ భారీ ఎండల్లో థియేటర్ లలో విడుదల అయిన ఈ సినిమా ప్రేక్షకులకు చల్లటి విందును కలిగించింది. ఇక దానితో ఈ సినిమా బ్లాక్ బాస్టర్ టాక్ ను తెచ్చుకొని అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఇలా ఆ సమయంలో సూపర్ సక్సెస్ అయిన ఈ సినిమా నేటితో విడుదల అయ్యి 18 సంవత్సరాలను పూర్తి చేసుకుంది. ఇప్పటికీ ఈ సినిమా విడుదల అయ్యి 18 సంవత్సరాలు అవుతున్న బుల్లి తెరపై ఈ మూవీ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: