బీజేపీ కుతంత్రాలకు ఆ రాష్ట్రం కూడా బలైపోతుందా....!

Prathap Kaluva

బీజేపీ అధికారం చేజిక్కుంచుకోవడం కోసం ఎన్ని అడ్డదారులైన తొక్కుతుందని మొన్న కర్ణాటక ఎన్నికల్లప్పడూ తెలిసి పోయింది. రాజ్యాంగాన్ని పాతరేసి, అది ప్రవర్తించిన తీరు అందరికీ గుర్తే ఉండి ఉంటుంది. అయితే ఇప్పడు  కూడా అలాంటి ప్రయోగమే జమ్మూ కాశ్మీర్ మీద ప్రయోగించడానికి సిద్ధం అయింది.  తాజాగా.. జమ్మూ కాశ్మీర్ లో తమ ఆధ్వర్యంలో ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి భారతీయ జనతా పార్టీ పావులు కదుపుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. మొన్నటిదాకా పీడీపీకి మద్దతు ఇచ్చిన భాజపా, కూటమి నుంచి వైదొలగి మెహబూబా ప్రభుత్వాన్ని కూల్చేసింది.


ఇప్పుడు ఆ పార్టీతో పాటు, అక్కడి కాంగ్రెస్ ను కూడా చీల్చి.. మరికొన్ని చిన్నా చితకా పార్టీలను కూడా కలుపుకుని మళ్లీ గద్దె ఎక్కాలని ప్లాన్ చేస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. కాకపోతే.. సమయం  చూసి దెబ్బకొట్టాలన్నట్టుగా వ్యవహరిస్తున్న భాజపా నాయకత్వం, అమర్ నాధ్ యాత్ర ముగిసిన తర్వాతే.. ఇలాంటి ఎత్తుగడలను ఆచరణలో పెట్టాలని చూస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. 


పీడీపీలో ఇప్పటికే తిరుగుబాటు వచ్చింది. పీడీపీకి ఉన్న 28 మందిలో గణనీయంగానే చీలికవర్గంగా ఏర్పడి భాజపాకు జైకొడతారనేది సమాచారం. 12 సీట్లున్న కాంగ్రెస్ ను కూడా చీల్చడానికి చూస్తున్నారు. 25 సీట్లున్న భాజపాకు అధికారానికి ఇంకా 19 మంది మాత్రమే కావాలి. ఈ వక్ర రాజకీయాల్లో భాగంగా.. అడ్డదారుల్లో తాము ఆడే ఆటలకు అడ్డులేకుండా ఉండడానికి గాను.. గవర్నర్ ను కూడా మార్చి.. ఆరెస్సెస్ నేపథ్యం ఉన్నవారినే నియమించాలని చూస్తున్నట్టు కూడా పుకార్లు వినిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: