ఈ ఒక్క హామీ తో వచ్చే ఎన్నికలలో ఉద్యోగుల ఓట్లు అన్ని జగన్ కే..!

KSK
వైసీపీ అధినేత జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప పాదయాత్ర ఆంధ్ర రాష్ట్రంలో అనేక సంచలనాలు సృష్టిస్తోంది. ప్రస్తుతం జగన్ తలపెట్టిన ప్రజా సంకల్ప పాదయాత్ర తూర్పుగోదావరి జిల్లాలో కొనసాగుతోంది. ఈ నేపద్యంలో జగన్ తన పాదయాత్రలో ప్రజలను ఆకట్టుకుంటూ ప్రసంగిస్తూ వైసీపీ అధికారంలోకి వస్తే ఏ ఏ కార్యక్రమాలు చేపడతారు సవివరంగా చెబుతూ ముందుకు సాగుతున్నారు.

ఇదే సమయంలో అధికార పార్టీ అయిన తెలుగుదేశం ఎటువంటి అవినీతి కార్యక్రమాలు చేపడుతున్న వాటిని కూడా ప్రజల ముందు పెడుతూ ప్రతిపక్ష నేతగా వాటిని ఖండిస్తూ పోరాడుతూ ముందుకు సాగుతున్నారు. ముఖ్యంగా 2014 ఎన్నికలలో చంద్రబాబు ఏ విధంగా ప్రజలకు అబద్ధపు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి మోసం చేశారో కళ్ళకు కట్టినట్లుగా జగన్ తన ప్రచార సభల్లో ఎండగడుతున్నారు.

అంతేకాకుండా రాబోయే ఎన్నికలలో చంద్రబాబు ఎటువంటి అబద్ధపు హామీలు ఇస్తారో కూడా వాటిని ప్రజలకు తెలియ పరుస్తూ అప్రమత్తంగా ఉండాలని ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని ప్రజలను చైతన్య పరుస్తున్నారు. ప్రస్తుతం జగన్ తూర్పుగోదావరి జిల్లాలో త‌న పాద‌యాత్ర‌ను ముమ్మ‌డివ‌రంలో చేస్తున్నారు. జ‌గ‌న్ ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై పోరాటంలో భాగంగా పాద‌యాత్ర చేస్తూ తమ ప్రాంతానికి వ‌చ్చార‌ని తెలుసుకున్న ప్ర‌జ‌లు అశేషంగా త‌ర‌లి వ‌చ్చారు.

జ‌గ‌న్‌ను చూసేందుకు.. జ‌గ‌న్ అడుగులో అడుగు వేస్తూ పాద‌యాత్ర‌లో పాల్గొనేందుకు ఆస‌క్తి చూపుతున్నారు. ఇదే క్ర‌మంలో వైఎస్ జ‌గ‌న్‌ను ఏపీ సీపీఎస్ నేత‌లు క‌లిశారు. సీపీఎస్ విధానాన్ని ర‌ద్దు చేయాల‌ని జ‌గ‌న్‌ను కోరారు. వెంట‌నే స్పందించిన వైఎస్ జ‌గ‌న్ మాట్లాడుతూ.. వైసీపీ అధికారంలోకి రాగానే.. సీపీఎస్ విధానాన్ని వెంట‌నే ర‌ద్దు చేస్తామ‌ని హామీ ఇచ్చారు. దీంతో జ‌గ‌న్‌ను క‌లిసిన ఏపీ సీపీఎస్ నేత‌లు హ‌ర్షం వ్య‌క్తం చేశారు. ఈ హామీతో రాబోయే ఎన్నికలలో కచ్చితంగా జగన్ ని గెలిపించుకుంటామని ప్రగాఢంగా చెబుతున్నారు ప్రభుత్వ ఉద్యోగులు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: