ఓటీటీ డేట్ లాక్ చేసుకున్న సూపర్ హిట్ మలయాళ రీమేక్ మూవీ...!!

murali krishna
థియేటర్స్ లో ప్రేమలు సినిమా క్రియేట్ చేసిన మ్యాజిక్ తర్వాత.. మలయాళీ సూపర్ సక్సెస్ సాధించిన సినిమా మంజుమ్మేల్ బాయ్స్ ను రిలీజ్ చేశారు.మలయాళం సినిమా ఇండస్ట్రీకి 2024 కలిసొచ్చిందనే చెప్పాలి. ఈ ఏడాదిలో రిలీజైన దాదాపు అన్ని సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి.మంజుమ్మల్ బాయ్స్ మూవీ మలయాళంలో ఫిబ్రవరి 22న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమా ఫస్ట్ షో నుంచి తన హవా చూపించింది. బాక్సాఫీసు వద్ద భారీ కలెక్షన్లతో రికార్డులు సృష్టించింది.
ఏకంగా రూ.200 కోట్ల కలెక్షన్లు సాధించిన తొలి మలయాళం మూవీగా ఎన్నో రికార్డులను క్రియేట్ చేసింది. ఇక మలయాళంతో పాటు తమిళంలోనూ ప్రేక్షకుల ముందుకు వచ్చి దుమ్ముదులిపేసింది. ఇక తెలుగులోనూ ఏప్రిల్ 6న రిలీజై బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. దీంతో ఈ మూవీ ఓటీటీలోకి ఎప్పుడెప్పుడు వస్తుందా? అని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఈ నేపథ్యంలో వారికి ఓ గుడ్ న్యూస్ అందింది. ఈ మూవీ ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్నీప్లస్ హాట్‌స్టార్ ఈ మూవీ స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకుంది. దీంతో ఈ మూవీ స్ట్రీమింగ్ డేట్‌ని ఈ సంస్థ తాజాగా వెల్లడించింది. ఈ మేరకు ఈ చిత్రాన్ని మే 5న డిస్నీప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ చేస్తున్నట్లు వెల్లడించారు. దీనిని హిందీ, మలయాళం, తమిల్, తెలుగు, కన్నడ భాషల్లో రిలీజ్ చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ.. డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ఓ టీజర్‌ను రిలీజ్ చేసింది.రియల్ లైఫ్‌లో జరిగిన సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని చిదంబరం తెరకెక్కించాడు. తమిళనాడులోని కొడైకెనాల్‌కి టూర్‌కి వెళ్లిన కొందరు కేరళ యువకులు అక్కడ ఎలాంటి ఇబ్బందులు, సమస్యలు ఎదుర్కొన్నారు అనే కాన్సెప్ట్ ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించారు. ఈ మూవీ కథ మొత్తం 'గుణ కేవ్' చుట్టూ తిరుగుతుంది. ఇక సర్వైవల్ థ్రిల్లర్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఆడియన్స్‌కు సూపర్ థ్రిల్లింగ్‌ను అందించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: