ప్రస్తుతం దేశవ్యాప్తంగా తన ఉనికిని చాటుకునేందుకు పెద్ద ఎత్తున ప్రయత్నాలను చేస్తున్న రాజకీయ పార్టీలలో భారతీయ జనతా పార్టీ ముందు వరుసలో ఉంటుంది. దీని ఉనికి కొన్ని సంవత్సరాల క్రితం వరకు నార్త్ లో బాగా ఉండేది. నార్త్ లో ఈ పార్టీ కి ప్రజల నుండి మంచి ఆదరణ దక్కేది. సౌత్ లో ఈ పార్టీ కి పెద్దగా ఆదరణ దక్కేది కాదు. కానీ గత కొన్ని సంవత్సరాలుగా సౌత్ రాష్ట్రాలలో కూడా ఈ పార్టీ కి మంచి ఆదరణ దక్కుతుంది. ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా బి జె పి పార్టీ కి మంచి అసెంబ్లీ , పార్లమెంటు స్థానాలు దక్కుతున్నాయి. ఇక్కడ వచ్చే ఎన్నికల్లో ఈ పార్టీ కి మంచి అసెంబ్లీ , పార్లమెంటు స్థానాలు వచ్చే అవకాశం కూడా ఉంది అని చాలా మంది భావిస్తున్నారు. ఇక కేరళ లో మాత్రం బి జె పి పార్టీ కి ఇప్పట్లో మంచి ఉనికి కష్టం అని చాలా మంది అనుకున్నారు. కానీ కేరళ రాష్ట్రంలో కూడా బి జె పి చాప కింద నారుల తయారవుతుంది అని కొంత మంది అభిప్రాయ పడుతున్నారు. ఇప్పటికే బీ జే పీ పార్టీ కి ఇక్కడ మంచి ఆదరణ అక్కడ జనాల నుండి దక్కుతున్నట్లు , నెక్స్ట్ ఎన్నికలలో బి జె పి పార్టీ అక్కడ మంచి ఓటు బ్యాంకు ను దక్కించుకొనే అవకాశం ఉంది అని చాలా మంది అభిప్రాయ పడుతున్నారు.
కేరళ రాష్ట్రానికి ప్రస్తుతం శ్రీ పినరాయి విజయన్ ముఖ్య మంత్రి గా కొనసాగుతున్నాడు. శ్రీ పినరాయి విజయన్ వామపక్ష ప్రజాస్వామ్య ఫ్రంట్ (LDF) నాయకుడు మరియు భారత కమ్యూనిస్ట్ పార్టీ (మార్క్సిస్ట్) (CPI(M)) సభ్యుడు. మే 2016 నుండి ఈయన ఈ పదవి లో కొనసాగుతున్నాడు. మరియు 2021 లో రెండో సారి తిరిగి ఈ పదవికి ఈయన ఎన్నికయ్యాడు. దానితో ఈయనే మూడవ సారి కూడా కేరళ రాష్ట్రానికి ముఖ్య మంత్రి గా నియమితుడౌతాడు అని చాలా మంది ప్రజలు భావిస్తున్నారు. ఇక బి జె పి పార్టీ కి ఈ సారి కేరళ రాష్ట్రం లో మంచి ఓటు బ్యాంకు నమోదు అయ్యే అవకాశాలు పెద్ద ఎత్తున ఉన్నాయి అని కూడా కొంత మంది అభిప్రాయ పడుతున్నారు. మరి కేరళ రాష్ట్రం లో బి జె పి పార్టీ తన ఉనికి ని ఏ స్థాయిలో చాటుకుంటుందో తెలియాలి అంటే నెక్స్ట్ ఎన్నికల వరకు వెయిట్ చేయాల్సిందే.